Man plays with lion : మనం అడవిలోని అత్యంత క్రూరమైన,కఠినమైన జంతువుల గురించి మాట్లాడినట్లయితే మొదటిగా వినిపించే పేరు సింహం(Lion). అడవికి రాజు అని సింహంని పిలుస్తారు,దాని వేట సామర్థ్యాన్ని చూసి అందరూ భయపడతారు. అలాంటి జంతువు తన మందమీదపై కాకుండా వేరే మానవుడిపై ప్రేమను కురిపించడం చూస్తే, అది నమ్మడం కష్టమే కాదు, అసాధ్యం కూడా అవుతుంది. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో "లయన్ లవర్స్ హబ్(lionlovershub)" అనే అకౌంట్ లో " మీ బెస్ట్ ఫ్రెండ్‌కు మీ ఆప్యాయత అవసరమైనప్పుడు"అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఓ వీడియోలో ఓ సింహం మనిషితో చాలా ప్రేమగా ఆడుకోవడం చూడవచ్చు. సింహానికి ఈ వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి అని కూడా ఆ వీడియో ఆలోచించేలా చేస్తుంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి పెద్ద సింహంతో కనిపించడం చూడవచ్చు. అతను చాలా హాయిగా సింహం వెంట్రుకలను పట్టుకుని లాలించడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. సింహం కూడా తన తలను అతని చేతుల్లో పెట్టుకునేంతగా ఆ వ్యక్తి ప్రేమించడం లాలించడం కనిపిస్తుంది. దీని తర్వాత ఆ వ్యక్తి దానిని ముద్దుపెట్టుకుంటాడు, ప్రేమతో ఆమెను లాలించడం కొనసాగిస్తాడు. ఇంత పెద్ద, క్రూరమైన సింహాన్ని ఎవరైనా ఎలా ప్రేమిస్తారా అని వీడియో చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని 3.8 మిలియన్లకు పైగా అంటే 38 లక్షల మందికి పైగా చూశారు. అయితే 2 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేశారు. ఈ వ్యక్తి చాలా అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Dogs: 100 దేశీయ కుక్క జాతులను సంరక్షిస్తున్న తమిళనాడు వాసి..బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2022 సొంతం..
మరోవైపు, ఓ చిరుతపులి తన ప్రవృత్తికి విరుద్ధంగా ప్రవర్తించింది. రోడ్డుపై అడవి నుంచి వచ్చిన చిరుతపులి పక్కనే ఆవు గడ్డి మేస్తోంది. అయితే చిరుత ఆవును(Cow) వేటాడకుండా దాన్ని దాటి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. Instagram vikrantsmaik లో షేర్ చేయబడిన దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో చిరుతపులి వ్యవహరించిన తీరు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. డవిలోంచి బయటకు వచ్చిన చిరుతపులి రోడ్డుపై నిల్చున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. అదే దారిలో వెళుతున్న కొందరు తమ కెమెరాల్లో చిరుతను బంధించారు. చిరుతపులి రోడ్డుపై ఉండగా, అదే సమయంలో పక్కనే నిలబడి ఉన్న ఆవు మేస్తోంది. ఆవుపై చిరుతపులి కన్ను పడగానే, వేగంగా దాడి చేసి దానిని తన వేటగా మార్చుకుంటాడని చూపరులు భావించారు. అయితే అక్కడ జరిగింది ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. చిరుతపులి చాలా ప్రశాంతంగా కనిపించింది. ఆవు రూపంలో మంచి వేటను చూసిన తర్వాత కూడా చిరుతపులి దానిపై దాడి చేయలేదు లేదా హాని చేయడానికి ప్రయత్నించలేదు. బదులుగాఆవును చూసిన తర్వాత కూడా, దానికి చాలా దగ్గరగా ఉండటంతో అడవి వైపు వెళ్లిపోయింది. కానీ చిరుతపులి ఆవు ముందుకి వచ్చిన క్షణంలో ఆవు కూడా తనకి దగ్గరగా ఉన్న చిరుతను చూసి భయపడింది. అయితే ఆవుకు ఎలాంటి హాని కలగకుండా చిరుత ప్రశాంతంగా వెళ్లడంతో చూపరులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Video