హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Stone Was Found: అతడికి ఓ రాయి దొరికింది.. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.. ఇంతకు ఏంటి దీని ప్రత్యేకత అంటే..

Stone Was Found: అతడికి ఓ రాయి దొరికింది.. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.. ఇంతకు ఏంటి దీని ప్రత్యేకత అంటే..

రాయిని పరీక్షించిన జియాలజిస్ట్ లు

రాయిని పరీక్షించిన జియాలజిస్ట్ లు

Stone Was Found: అదృష్టం అనేది ఎవరికి.. ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. ఎటు నుంచి వస్తుందో కూడా మనం ఊహించలేదు. కొన్ని ఘటనలు జరుగుతున్నంత సేపు అవి నిజమేనా.. లేదంటే కలేమైన కంటున్నామా అని.. గిల్లుకొని మరీ చూస్తుంటాం. అయితే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...

  అదృష్టం(Luck) అనేది ఎవరికి.. ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. ఎటు నుంచి వస్తుందో కూడా మనం ఊహించలేదు. కొన్ని ఘటనలు జరుగుతున్నంత సేపు అవి నిజమేనా.. లేదంటే కలేమైన కంటున్నామా అని.. గిల్లుకొని మరీ చూస్తుంటాం. అయితే ఇలాంటి ఘటన(Incident) ఒకటి చోటు చేసుకుంది. ఆ ఘటనకు బాధ్యుడైన అతడే దానిని నమ్మలేకపోయాడు. ఇంతకు ఏం జరిగింది.. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేం. ఆస్ట్రేలియాలోని (Australia) మెల్‌బోర్న్‌కు (Melborne) చెందిన డేవిడ్ (David) అనే వ్యక్తి 2015లో స్థానికంగా ఉన్న ఓ పార్క్‌లో వాకింగ్ (Walking )చేస్తుండగా ఓ రాయి(Stone) కనిపించింది.

  Bigg Boss 5 Telugu Elimination Twist: ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. మారుతున్న సమీకరణాలు.. బయటకు వెళ్లేది ఎవరంటే..


  అయితే ఎవరికైనా రాళ్లు అనేవి సాధారణంగా కనిపిస్తుంటాయి.. వాటి వల్ల ప్రమాదాలు కూడా సంబవించిన సందర్భాలు ఉన్నాయి. వాటి వళ్ల గాయపడిన ఘటనలు కూడా కోకొల్లలు. అయితే అతడు పార్క్ లో ఒక రౌండ్ వాకింగ్ చేశాడు.. ఆ రౌండ్లో ఓ రాయి అతడికి కనిపించింది. కానీ అతడు దానిని చూసి.. ఏదోలే అని మళ్లీ మరో రౌండ్ వేశాడు. అప్పుడు కూడా అతడి చూపు ఆ రాయిపైనే పడింది. ఎందుకు అంతలా అతడు ఆ రాయి వైపే చూస్తున్నాడంటే.. అన్ని రాళ్ల కంటే అది భిన్నంగా ఉంది. అది కూడా ఆ పార్క్ లో చెట్ల మధ్యలో ఉంది. అతడికి అది విచిత్రంగా అనిపించడంతో.. వాకింగ్ అయిపోయిన తర్వాత దానిని పట్టుకొని తన ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకెళ్లాడు.

  FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణ కోసం ఖతార్‌ గూఢచర్యం.. వెలుగులోకి వాస్తవాలు..


  ఇంటికి రాయిని తెచ్చిన తర్వాత ఓ మూలన ఉంచి తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. తర్వాత మరో రోజు అతడి ఆలోచన ఆ రాయిపై పడింది. ఆ రాయి దాదాపు 17 కేజీల బరువు ఉంటుంది. ఇక దానిని ముక్కలు ముక్కలుగా చేయాలని ఆలోచించాడు. ఆలోచించినట్లుగానే ఆ రాయిని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అస్సలు ఏ మాత్రం అది పగల్లేదు. ఈ సారి అతడు.. డ్రిల్లింగ్ మిషన్ వినియోగించేందుకు ప్రయత్నించారు. అయినా.. రాయి పగలలేదు.

  Explained: ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు అంటే ఏంటి..? పబ్లిక్ క్రిప్టోల కంటే ఇవి ఎలా భిన్నంగా ఉంటాయి..?


  అరే ఏంటి ఇధి.. ఈ రాయి అస్సలు పగడం లేదంటూ అనుమానం వచ్చింది. ఇక ఇలా కాదు అని ఆ వ్యక్తి రాయిని స్థానిక మ్యూజియానికి తీసుకెళ్లి పరీక్ష చేయించాడు. ఆ రాయిని పరీక్షించిన జియాలజిస్టులు షాక్ అయ్యారు. ఆ రాయి సుమారు 460 కోట్ల సంవత్సాల క్రితం నాటిదని, అంతరిక్షం నుంచి భూమిపై పడిన ఉల్క అని, బంగారం కంటే ఆ రాయి ఎన్నో రెట్లు విలువైనదని చెప్పారు.

  Painfull Incident: దారుణం.. అతడు ఆ పని చేశాడని.. పందిరి గుంజ కు 18 గంటల పాటు తాళ్లతో కట్టేసి చితకబాదారు..


  ఆ మాట వినగానే సదరు వ్యక్తికి భూమిపై కాళ్లు ఆగలేదు. ఎగిరి గంతేశాడు. అతడికి అది 2015లో దొరకగా.. దానిని ఇటీవల పరీక్షించాడు. ఇక ఆ పార్కు విషయానికి వస్తే.. ఆ పార్కులో బంగారంతో పాటుగా విలువైన వస్తువులు దొరుకుతుంటాయట. పార్క్‌లో దొరికిన వస్తువులను సందర్శకులు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇలానే అతడికి దొరికిన రాయిని తీసుకొని వెళ్లాడు. ఆ రాయి విలువ బంగారం కంటే ఎక్కువ కావడంతో అతడు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.

  Published by:Veera Babu
  First published:

  Tags: International news, Trending news, Viral, VIRAL NEWS

  ఉత్తమ కథలు