హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఎంత కష్టమొచ్చెనే : ప్రియుడితో భార్య జంప్..కొడుకుని ఎత్తుకొని తండ్రి రిక్షా సవారీ

ఎంత కష్టమొచ్చెనే : ప్రియుడితో భార్య జంప్..కొడుకుని ఎత్తుకొని తండ్రి రిక్షా సవారీ

ఓ చేత్తో కొడుకుని పట్టుకొని,మరో చేత్తో రిక్షా సవారీ చేస్తున్న రాజేశ్

ఓ చేత్తో కొడుకుని పట్టుకొని,మరో చేత్తో రిక్షా సవారీ చేస్తున్న రాజేశ్

Rickshaw Puller Viral Video : కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న క్రమంలోనే ఓ అమ్మాయితో పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇటీవల అతడి భార్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో ఇద్దరి పిల్లల బాధ్యత అతడిపైనే పడింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Man rides rickshaw holding  son : ఉన్నఊరిలో ఉపాధి లభించక పొట్టకూటి కోసం పదేళ్ల కిందట తెలియని ప్రాంతానికి వచ్చాడు. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న క్రమంలోనే ఓ అమ్మాయితో పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇటీవల అతడి భార్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో ఇద్దరి పిల్లల బాధ్యత అతడిపైనే పడింది. చేసేదేమీ లేక ఓ చేత్తో కుమారుడిని ఎత్తుకొని మరో చేత్తో రిక్షా(Rickshaw) నడుపుతున్నాడు. ఓ చేత భుజాన బిడ్డను ఎత్తుకుని మరో చేత్తో రిక్షా తొక్కతూ ఓ తండ్రి పడుతున్న కష్టాన్ని చూస్తే ఎవరికైనా దు:ఖం రావాల్సిందే. ఒంటి మీద కనీసం బట్టలు కూడా లేని ఆ పసివాడి దీనావస్థను చూస్తే కంట నీరు కారాల్సిందే. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్(Madhyapradesh)​లో వెలుగు చూసింది.


బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేశ్ మల్దార్( పదేళ్ల కిందట పొట్టకూటి కోసం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు వచ్చాడు. కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సమయంలో సియోనిలోని కన్హర్ వాడ గ్రామానికి చెందిన అమ్మాయితో రాజేశ్ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబంతో రోడ్డు పక్కన పుట్​పాత్​పైనే నివసిస్తున్నాడు రాజేశ్. ఇద్దరు పిల్లలతో రాజేశ్ మల్దార్ లైఫ్ బిందాస్ గా సాగుతున్న సమయంలో కొద్ది రోజుల క్రితం రాజేశ్ భార్య పిల్లలిద్దరినీ విడిచిపెట్టి స్థానికంగా ఉంటున్న ఓ ట్రక్కు డ్రైవర్​తో వెళ్లిపోయింది. భార్య ఆచూకీ కోసం రాజేశ్ తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. దీంతో రాజేశ్ జీవితం ఒక్కసారిగా రివర్స్ అయింది. ఓ పక్క ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య మోసం చేసి వెళ్లిపోవడం,మరోవైపు పిల్లలిద్దరూ పసివాళ్లు కావడంతో రాజేశ్ కు ఏం చేయాలో అర్ధం కాలేదు.


Video : బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతి కేసులో కీలక మలుపు..కీలక వీడియో బయటికి


చేసేదేమీ లేక రాజేశ్.. మూడేళ్ల కూతురును తన తల్లి దగ్గర ఉంచి,ఏడాది వయసున్న కొడుకును మాత్రం ఓ చేత్తో కొడుకుని ఎత్తుకొని మరో చేత్తో రిక్షా నడుపుతున్నాడు. ఓ చేతితో కొడుకుని భుజాన వేసుకుని... ఇంకో చేత్తో రిక్షా తొక్కుతూ బతుకు బండిని లాగుతున్న రాజేశ్ ను చూసిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. షేర్ చేసిన గంటల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ గా మారింది.
రాజేశ్​ దుస్థితి చూసి అందరూ చాలా చలించిపోయారు.  రాజేశ్ కి కొంత మంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు, సోషల్ మీడియా వైరల్ అయిన రాజేశ్ వీడియో చైల్డ్​ వెల్ఫేర్ కమిటీ దృష్టికి వెళ్లడంతో.... పసిబిడ్డను ఎత్తుకొని ప్రమాదకరంగా రిక్షా నడపొద్దని రాజేశ్ ను మందలించారు చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీ అధికారులు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Extra marital affair, Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు