మనదేశంలో ఎన్నో ప్రాంతాలు దోమల బెడదతో అల్లాడిపోతున్నాయి. పల్లెటూర్ల నుంచి పట్టణాలు, నగరాల వరకు అంతటా దోమల వ్యాప్తి (Mosquito) పెరిగింది. రాత్రి కాగానే.. ఇంట్లో తిరుగుతూ.. మనకు నిద్రలేకుండా చేస్తున్నాయి. సూదిలా కుడుతూ.. అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. మలేరియా (Malaria), డెంగ్యూ (Dengue) వంటి రోగాల పాలు చేస్తున్నాయి. దోమల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అంతేకాదు ఈ ప్రపంచంలో అధిక మొత్తంలో మనషులను చంపిన జీవి కూడా దోమే. అంతలా మనుషుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి దోమలు. ఐతే దోమల వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తికి గురించి మీకు తెలుసా? మలేరియా, డెంగ్యూ కాదు. అతడు.. ఏకంగా కోమాలోకి వెళ్లాడు.
జర్మనీకి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్ష్కేకి ఆసియా టైగర్ (Asia Tiger Mosquito)జాతికి చెందిన దోమ కరిచింది. ఆ దోమ కాటుతో సెబాస్టియన్ జీవితమే ఛిన్నాభిన్నమైంది. గత ఏడాదే అతడు దోమ కాటుకు గురయ్యాడు. ఆసియా టైగర్ దోమ కాటు వల్ల బాధితుడి రక్తంలో విషం వ్యాపించింది. డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. దోమ కాటు వల్ల సెబాస్టియన్కు ఇన్ఫెక్షన్ సోకింది. క్రమంగా కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించి.. అవి పనిచేయడం మానేశాయి. చివరకు ఎడమ తొడపై చర్మ మార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది. కాలి వేళ్లను కూడా కత్తిరించారు.
Qatar : ఖతార్లో ఓవర్ ఎక్స్పోజింగ్.. మాజీ అందాల సుందరిపై విమర్శలు
ఆసియా టైగర్ దోమ సెబాస్టియన్ ఎడమ తొడపై కుట్టింది. దోమ కాటు ద్వారా సెరాటియా అనే బ్యాక్టరీయా శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత అతడిలో ఫ్లూ వంటి లక్షణాలు కనిపించాయి. మొదట లైట్ తీసుకున్నాడు. కానీ పరిస్థితి రోజు రోజూకు దిగజారింది. అనారోగ్యం తీవ్రమైంది. తొడ భాగం మొత్తం పాడవడంతో.. అతడు మంచానికే పరిమితమయ్యాడు. సరిగా తినలేకపోయాడు. మంచం మీది నుంచి లేవలేకపోయాడు. అంతలా సెబాస్టియన్ ఆరోగ్యం క్షీణించింది. చివరకు ఓ రోజు అచేతనంగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నాలుగు వారాల పాటు కోమాలో ఉన్నాడు. డాక్టర్లు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆ దోమ కాటు వల్ల తొడపై చర్మ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత మరో 30 రకాల ఆపరేషన్లు కూడా జరిగాయి. రెండు కాలి వేళ్లను పూర్తిగా తొలగించారు.
ప్రస్తుతం సెబాస్టియన్ క్రమంగా కోలుకుంటున్నాడు. కానీ అతడి ఆరోగ్యం మునపటిలా ఉండదు. అంత యాక్టివ్గా జీవించలేడు. ప్రతి వారానికి ఓసారి వైద్య చికిత్స అవసరం. డాక్టర్లు లేనిదే అతడు జీవించలేకపోతున్నాడు. మొత్తంగా ఆ దోమ కాటు వల్ల సెబాస్టియన్ జీవితమే సర్వ నాశనమయింది. ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని.. ఆలస్యం చేస్తే తనలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.