హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: భార్య లావుగా మారిందని.. భర్త చేసిన పనికి నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు..

OMG: భార్య లావుగా మారిందని.. భర్త చేసిన పనికి నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: ఇద్దరికి ఎనిమిదళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. కొన్ని రోజుల నుంచి భర్త ఏదో ఒక విషయంలో భార్యతో గొడవ పెట్టుకుంటున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కొంత మంది వివాహ బంధానికి (Marriage) ఉన్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. ప్రతి చిన్నవిషయాన్ని భూతద్దంలో చూసుకుని, చక్కని కాపురాన్ని కాస్త గొవవలు పెట్టుకుని, రోడ్డుమీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు వివాహేతర సంబంధాలు (affairs)  పెట్టుకుంటూ తమ జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఇంకొందరు పెళ్లయ్యాక.. కూడా కట్నం ఇవ్వలేదని, ఇంకా బంగారం కావాలని భార్యలను వేధిస్తుంటారు. మరికొందరు.. భార్య చికెన్ వండలేదని, సరిగ్గా మాట్లడటంలేదని, వాళ్లను వదిలించచుకొవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh)  మీరట్ లో వింత ఘటన జరిగింది. మీరట్ జిల్లాలోని లిసారి గేట్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా జాకీర్ కాలనీకి చెందిన సల్మాన్, నజ్మా భార్యభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఏడెళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కొన్నిరోజుల నుంచి భర్త వేధింపులు (Husband harassment)  ఎక్కువయ్యాయి.


అయితే.. తాను.. లావుగా మారానని, అందుకు తన భర్త.. తన నుంచి విడాకులు కావాలని వేధిస్తున్నాడని నజ్మా వాపోయింది. అందుకే తనకు ట్రిపుల్ తలాక్ కూడా చెప్పాడని తెలిపింది. అతను విడాకుల నోటీసు కూడా పంపించాడు. అందులో బరువు పెరిగినందుకు ట్రిపుల్ తలాఖ్ (Triple talaq)  ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఆమె మనో వేదనకు గురై పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా పవిత్ర మైన నదిలో దుండగులు హుక్కా కొట్టారు.
ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  ప్రయాగ్ రాజ్ గంగా నదిలో కొంత మంది గుర్తు తెలియని దుండగులు హుక్కాను తాగుతూ, ఆతర్వాత.. చికెన్ వండుకుని తింటున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. దీనిపై స్థానిక పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. ఈ సంఘటన ప్రయాగ్‌రాజ్‌లోని దారాగంజ్ వద్ద ఉన్న నాగవాసుకి మందిర్ దగ్గర నుండి - హిందువులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.
నగర పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిపై పోలీసు కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బోటులో ఎంజాయ్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఎస్పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. కాగా, గత వారం గంగా, యమునా నదుల్లో నీటిమట్టం పెరగడంతో ప్రయాగ్‌రాజ్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాజాపూర్, బఘరా, దారాగంజ్, తదితర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల్లో నీరు చేరింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.

First published:

Tags: Crime news, Female harassment, Uttar pradesh

ఉత్తమ కథలు