స్టేజీ మీదే మంత్రికి హెయిర్ కట్ చేసిన బార్బర్, రూ.60,000 ఇచ్చిన అమాత్యుడు

ఓ మంత్రిని తనకు ఆర్థిక సాయం చేయాలని కోరాడు. కానీ, అతడికి ఎంత పనివచ్చో చెక్ చేయాలనుకున్న మంత్రి వెంటనే స్టేజీ మీదే తనకు హెయిర్ కట్, షేవింగ్ చేయాలని కోరాడు.

news18-telugu
Updated: September 12, 2020, 3:24 PM IST
స్టేజీ మీదే మంత్రికి హెయిర్ కట్ చేసిన బార్బర్, రూ.60,000 ఇచ్చిన అమాత్యుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ పేద బార్బర్. చేతిలో కత్తి, దువ్వెన ఉన్నాయి. పని వచ్చు. కానీ, చిన్న షాపు పెట్టుకుందామన్నా డబ్బులు లేవు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో అక్కడకు వచ్చిన ఓ మంత్రిని తనకు ఆర్థిక సాయం చేయాలని కోరాడు. కానీ, అతడికి ఎంత పనివచ్చో చెక్ చేయాలనుకున్న మంత్రి వెంటనే స్టేజీ మీదే తనకు హెయిర్ కట్, షేవింగ్ చేయాలని కోరాడు. అమాత్యుడు అడిగిందే తడవుగా ఆ యువకుడు చకచకా హెయిర్ కట్, షేవింగ్ చేశాడు. అతడి పనికి మెచ్చుకున్న మంత్రి వెంటనే రూ.60,000 ఆర్థిక సాయం చేశారు. బార్బర్ షాపు పెట్టుకోమని సూచించారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. ఖాండ్వా జిల్లాలోని గులైమాల్ ప్రాంతానికి చెందిన రోహిదాస్ అనే యువకుడికి ఈ పరిస్థితి ఎదురైంది. మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రి విజయ్ షా స్థానికంగా జరిగే ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఎలాగో మంత్రి వద్దకు చేరుకున్న రోహిదాస్ తన పరిస్థితిని వివరించాడు. తనకు సాయం చేయాలని కోరాడు. అప్పటికప్పుడు మంత్రి స్టేజ్ మీద హెయిర్ కట్ చేస్తావా అని ప్రశ్నించారు. రోహిదాస్ కూడా ఓకే అన్నాడు. వెంటనే ఓ కుర్చీ ఏర్పాటు చేశారు. రోహిదాస్ మాస్క్ పెట్టుకున్నాడు. చకచకా తన వద్ద ఉన్న కత్తెర, దువ్వెన బయటకు తీసి టకటకా కటింగ్ చేశాడు. అనంతరం షేవింగ్ కూడా చేశాడు. దీంతో మంత్రి విజయ్ షా ముచ్చటపడ్డారు. వెంటనే రూ.60,000 తీసి అతడికి అందించారు. దుకాణం పెట్టుకోమని చెప్పారు.

‘ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి ఉపాధి కూడా పోయింది. కొన్ని నెలల నుంచి వారు బాధపడుతున్నారు. అదే సమయంలో బార్బర్ షాపుకి వెళ్లి కటింగ్ చేయించుకుంటే కరోనా వస్తుందేమో అనే భయం కూడా జనంలో ఉంది. ఆ భయాన్ని పోగొట్టడానికి, సరిగా మాస్క్ పెట్టుకుని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి భయం ఉండబోదని ప్రజలకు కూడా ధైర్యం కల్పించడానికే స్టేజ్ మీద కటింగ్, షేవింగ్ చేయించుకున్నా.’ అని మంత్రి విజయ్ షా చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 12, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading