Home /News /trending /

MAN GETS HIRED BY GOOGLE AFTER 39 ATTEMPTS HIS STORY IS NOW GOES VIRAL PAH

హ్యట్సాఫ్.. ఇది కదా సెన్సెషన్ అంటే.. 39 సార్లు రిజక్ట్ చేసిన కంపెనీ.. చివరకు...

టైలర్ కోహెన్ (ఫైల్)

టైలర్ కోహెన్ (ఫైల్)

San Francisco: తన కలను సాకారం చేసుకొవడానికి నిరంతరం తపన పడ్డాడు. సాఫ్ట్ వేర్ కంపెనీ ఎన్నిసార్లు.. రిజక్ట్ చేసిన ఏమాత్రం నిరాశ పడలేదు. మరింత పట్టుదలతో కష్టపడ్డాడు.

కొంత మంది తమ జీవితంలో ఉన్నతమైన ఆలోచనలను కల్గి ఉంటారు. దాని కోసం పగలనక, రాత్రనక తపన పడుతుంటారు. కొంత మంది మంచి ఉద్యోగం సాధించాలని కలలు కంటారు. మరికొందరు.. ఎగ్జామ్స్ లో టాప్ ర్యాంక్ సాధించాలని అనుకుంటుంటారు. ప్రతి ఒక్కరు ఆయా రంగాల్లో తమ కంటూ గొప్ప గుర్తింపు రావాలని ప్రతినిత్యం తపన పడుతుంటారు. కొందరు ఉద్యోగం కోసం కష్టపడుతుంటే.. మరికొందరు బిజినెస్ రంగంలో రాణించాలని కోరుకుంటారు. అయితే, కొంత మంది అనుకున్నది సాధించే వరకు అసలు వదిలిపెట్టరు. ఇలాంటి వారికే లక్ అనేది వరిస్తుంది. ఎప్పటికైన విజయం సాధిస్తారు. ఇలాంటి స్పూర్తి దాయకమైన ఘటన వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. కాలిఫోర్నియాలోని (California)  శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టైలర్ కోహెన్ సాధించిన విజయగాథతో వార్తలలో నిలిచాడు. అతను గూగుల్ కంపెనీలో చేరాలని ప్రతి నిత్యం తపన పడుతుండే వాడు. ఈ క్రమంలో.. ఇప్పటి వరకు పలు మార్లు సంస్థలో ఉద్యోగం కోసం అప్లైచేశాడు. అయితే ఇంటర్వ్యూలలో తప్పిదాల వలన ఉద్యోగం సాధించడంలో విఫలమయ్యాడు. తన కలకోసం నిరంతరం శ్రమించాడు. టైలర్ కోహెన్ తొలిసారి గూగుల్ కు.. 2019 ఆగస్టు 25లో జాబ్ కు అప్లై చేశాడు. అదే విధంగా కొంత గ్యాప్ ఇస్తు వరుసగా అప్లై చేస్తునే ఉన్నాడు.



ఈ క్రమంలో 2020 లో కూడా పలుమార్లు ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే, 2022 లో కూడా అనేక సార్లు రిజక్ట్ చేయబడ్డాడు. అయితే.. రిజక్ట్ అయిన ప్రతిసారి తను చేసిన తప్పులను తెలుసుకున్నాడు. వాటన్నింటిని సరిదిద్దుకుంటూ.. 39 వ (Google After 39 Attempts) ప్రయత్నంలో విజయం సాధించాడు. దీనికి సంబంధించిన అనేక స్క్రీన్ షార్ట్ లను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. చివరకు తన డ్రీమ్డ్ కంపెనీలో ఉద్యోగం సాధించానని ఇన్ స్టాలో గర్వంగా చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ గా (viral news) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు టైలర్ కోహెన్ ను అభినందన సందేశాలతో ముంచెత్తుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: America, Job, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు