హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: ఓరి దేవుడా.. ఇన్నిసార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడా ? వదిలేస్తే సెంచరీ పూర్తయ్యేదేమో..

Viral News: ఓరి దేవుడా.. ఇన్నిసార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడా ? వదిలేస్తే సెంచరీ పూర్తయ్యేదేమో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇలా ఎక్కువ డోసులు తీసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. పలు దేశాల్లో ప్రజలకు నకిలీ సర్టిఫికెట్లు అమ్మేందుకు కొందరు ఈ రకమైన మోసాలకు పాల్పడ్డాడు.

కరోనా బారిన పడకుండా ఉండేందుకు మనలో చాలామంది ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకున్నాం. ఇప్పటికే దేశంలోని కోట్లాది మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక అవసరాన్ని బట్టి ప్రజలకు ముందుజాగ్రత్త డోసు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకునే విషయంలో మనలో చాలామందికి అపోహలు ఉండేవి. అయితే ఎంతోమంది ప్రముఖులు వ్యాక్సిన్(Vaccine) వేసుకోవడం, ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించడంతో చాలామంది ముందుకొచ్చారు. అయితే రెండు డోసులకు మించి వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య వందల్లో కూడా ఉండదు. కానీ జర్మనీకి (Germany) చెందిన ఓ వ్యక్తి ఏకంగా 90సార్లు కరోనా వ్యాక్సిన్ డోసులు వేసుకోవడం అక్కడి ఆరోగ్య సిబ్బందికి కూడా షాక్ ఇచ్చింది. ఒక జర్మన్ వ్యక్తి సుమారు 90 వ్యాక్సిన్ డోసులు తీసుకున్నాడు. అతడు 91వసారి కరోనా వ్యాక్సిన్ డోసు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.

ఆ వ్యక్తి వయస్సు 60 ఏళ్లుగా చెబుతున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలతో పాటు ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనే వివరాలను వెల్లడించలేదు. జర్మనీలోని సాక్సోనీ నివాసి అయిన ఈ వ్యక్తి ఎడిన్‌బర్గ్‌లో టీకా లైన్ నుండి పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి నకిలీ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లను సేకరించేందుకు ఇలా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తరువాత అతనికి అనుమతి లేకుండా టీకా కార్డు ఎలా జారీ చేయబడింది అనే దానిపై విచారణ ప్రారంభించారు.

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇలా ఎక్కువ డోసులు తీసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. పలు దేశాల్లో ప్రజలకు నకిలీ సర్టిఫికెట్లు అమ్మేందుకు కొందరు ఈ రకమైన మోసాలకు పాల్పడ్డాడు. అయితే ఒకే వ్యక్తి ఏకంగా 90 డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిది అని తెలుస్తోంది. అయితే 90సార్లు అతడు నిజంగానే వ్యాక్సిన్ డోసు తీసుకున్నాడా ? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అతడు గతంలో వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

Viral News: ఏం బామ్మర్దులు సామి మీరు..బావను చివరకు అలా మార్చేస్తారా..?

Photos Viral:ఆమె వయసు 10ఏళ్లు. 2ఏళ్ల వయసున్న చెల్లిని స్కూల్‌కి తీసుకెళ్లి ఏం చేసిందంటే

దీన్ని బట్టి అతడు ఇన్నిసార్లు వ్యాక్సిన్ తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటన్నది తెలుస్తుందని భావిస్తున్నారు. అయితే ఇన్నిసార్లు కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ? భవిష్యత్తులో అతడి ఆరోగ్యంపై ఈ వ్యాక్సిన్ డోసుల ప్రభావం ఏ విధంగా ఉంటుందనే అంశంపై కూడా వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న తరువాత వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Corona Vaccine, Trending news

ఉత్తమ కథలు