MAN FROM BRITIAN BECOME BIOLOGICAL FATHER FOR 138 MEMBERS HERE IS THE DETAILS AK
OMG: 66 ఏళ్ల ఈ వ్యక్తి 138 మంది పిల్లలకు తండ్రి.. టార్గెట్ పూర్తికాలేదట.. ఇతడి రూటే సెపరేటు..
స్పెర్మ్ డోన్ క్లైవ్
Viral News: అయితే బ్రిటన్‌లోని ఓ వ్యక్తికి సంబంధించిన స్పెర్మ్ డొనేషన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 129 మంది పిల్లలకు తండ్రిగా మారిన బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.
స్పెర్మ్ డోనర్ల సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో కొత్తేమీ కాదు. అక్కడి చట్టాలు కూడా అందుకు అనుమతిస్తాయి. బాలీవుడ్లో వచ్చిన ఆయుష్మాన్ ఖురానా చిత్రం విక్కీ డోనర్ మూవీ దీని గురించి మనకు కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. అయితే బ్రిటన్‌లోని ఓ వ్యక్తికి సంబంధించిన స్పెర్మ్ డొనేషన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 129 మంది పిల్లలకు తండ్రిగా మారిన బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. 66 ఏళ్ల క్లైవ్ జోన్స్ గత 10 సంవత్సరాలుగా స్పెర్మ్ డొనేషన్ చేస్తున్నారు. అలా 129 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్‌గా మారాడు. త్వరలో మరో ఈ రకంగా మరో 9 మంది పిల్లలకు తండ్రి కాబోతున్నాడు.
ఇలా మొత్తం 138 పిల్లలకు తండ్రి కానున్నాడు. 150 మందికి ఈ విధంగా తండ్రి అయిన తరువాత స్పెర్మ్ డొనేషన్‌కు ఫుల్ స్టాప్ చెబుతానని క్లైవ్ చెబుతున్నాడు. క్లైవ్ అధికారికంగా స్పెర్మ్ డోనర్ కాలేదు. ఎందుకంటే.. బ్రిటన్‌లో స్పెర్మ్ డోనర్ కావాలంటే గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. దీని కారణంగా కస్టమర్లతో ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ వారి అవసరాలను తీర్చుతున్నారు క్లైవ్.
ఇందుకోసం ఆయన వారి నుంచి డబ్బులు వసూలు చేయకపోవడం పెద్ద విషయం. ఒకరికి ఆనందాన్ని ఇవ్వడం, వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను ఆనందం పొందుతున్నానని చెప్పాడు క్లైవ్. -10 సంవత్సరాల క్రితం వార్తాపత్రికలో వచ్చిన ఒక కథనాన్ని చదివిన తరువాత పిల్లలు లేని వ్యక్తులు ఎంత మానసిక వేదనను అనుభవిస్తారో తెలిసి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు క్లైవ్.
అయితే హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ క్లైవ్‌కు హెచ్చరిక జారీ చేసింది. వాస్తవానికి క్లైవ్ తన వ్యాన్ నుండి స్పెర్మ్ డొనేషన్ పనిని నడుపుతున్నాడు. సాధారణంగా స్పెర్మ్ డొనేషన్, కొనుగోలు చేసే పనిని బ్రిటన్‌లో లైసెన్స్ పొందిన క్లినిక్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. క్లైవ్ వీటిని పాటించకపోవడం వల్ల పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.