Home /News /trending /

బెడ్ కింద నుంచి వింత శబ్దం.. అదేంటో అని చూస్తే షాకింగ్ సీన్.. కట్ చేస్తే..

బెడ్ కింద నుంచి వింత శబ్దం.. అదేంటో అని చూస్తే షాకింగ్ సీన్.. కట్ చేస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గిల్ విజెన్ అనే వ్యక్తి చాలా రోజులుగా తన మంచం కింద నుంచి వింత శబ్దాలు రావడం వింటున్నాడు. అయితే ఓ రోజు కోపంలో ఉన్న గిల్.. ఆ శబ్దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు.

    కొన్ని సందర్భాల్లో తెలియకుండా చేసే పనులే.. కొందరిని చాలా ఫేమస్ చేస్తుంటాయి. ఊహించని విధంగా అందరికి వారి గురించి తెలిసేలా చేస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఓ వ్యక్తిని బెస్ట్ ఫొటో‌గ్రాఫర్ (Best Photographer) అవార్డు పొందేలా చేసింది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. వివరాలు.. గిల్ విజెన్ అనే ఫొటోగ్రాఫర్ (Photographer Gil Wizen) చాలా రోజులుగా తన మంచం కింద నుంచి వింత శబ్దాలు రావడం వింటున్నాడు. అయితే ఓ రోజు కోపంలో ఉన్న గిల్.. ఆ శబ్దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈ వింత శబ్దాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుగొనే ప్రయత్నంలో చీకటి ఉండటంతో అతనికి ఏమి కనిపించలేదు. దీంతో గిల్ తన కెమెరా ప్లాష్ ఆన్ చేసి ఫొటో తీశాడు. ఆ తర్వాత ఫొటోను పరిశీలించిన అతడు ఆశ్చర్యపోయాడు. తన మంచం కింద ప్రమాదకరమైన సాలెపురుగును గుర్తించాడు.

    చాలా పెద్దగా ఉన్న Brazillian wandering spider బెడ్‌రూమ్‌లోనే ఉన్న గిల్ గుర్తించలేపోయాడు. అంతేకాకుండా దీని పిల్లలు కూడా అక్కడే ఉన్నాయి. గిల్ గుర్తించిన ఈ రకం సాలెపురుగు సాధారంగా అడవుల్లో కనిపిస్తుంది. అయితే అది ఇంట్లోకి ఎలా చేరిందనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. గిల్ ఇంటి నుంచి పెద్ద సాలెపురుగును, దాని పిల్లలను ఇంటి నుంచి తొలగించారు.

    భార్యపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు.. లక్షలు ఖర్చు చేసి ఆమెను ఆస్ట్రేలియాకు పంపించాడు.. కానీ చివరకు..







    ఇక, గిల్ తన కెమెరాతో సాలెపురుగు, దాని పిల్లల ఫొటోలు తీశాడు. గిల్ ఫోటో తీయడానికి ఫోర్స్‌డ్ పెర్స్పెక్టివ్‌ని ఉపయోగించాడు. అందువల్ల సాలెపురుగు మరింత పెద్దదిగా కనిపించింది. The spider room టైటిల్‌తో ఈ ఫొటోను ఒక పోటీకి పంపాడు. అందులో అతనికి అవార్డు కూడా వచ్చింది. అర్బన్ వైల్డ్‌లైఫ్‌కు సంబంధించి Wildlife Photographer of the Year అవార్డును గిల్ సొంతం చేసుకున్నాడు. ఇంత నిర్లక్ష్యంగా తీసిన ఫోటో తనను అంత ఫేమస్‌గా మారుస్తుందని గిల్‌ అనుకోలేదు. ‘మంచం క్రింద వేలాది సాలెపురుగులు ఉన్నాయి. వాటి పక్కన ఒక పెద్ద సాలెపురుగు విశ్రాంతి తీసుకుంటుంది. దాని శరీర పొడవు 45 మి.మీగా ఉంది’అని గిల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Photography, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు