Hands transplant: ఆపరేషన్ ద్వారా చేతులు పెట్టుకున్న వ్యక్తి.. తొలిసారి ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా? 

సర్జరీ సక్సెస్ కావడంతో నవ్వులు చిందిస్తున్న ఫెలిక్స్ గ్రెటార్సన్

ఐస్‌ల్యాండ్‌కి చెందిన ఓ వ్యక్తి రెండు చేతులను పోగొట్టుకున్నాడు. తాజాగా అతడికి జీవన్మృతుడి చేతులను అమర్చారు. ఆ సర్జరీ సక్సెస్ ఫుల్ అయిందని వైద్యులు కూడా వెల్లడించారు. ఇప్పుడిప్పుడే తన చేతులను తిరిగి కదపగలుగుతున్నాడు.

  • Share this:
సాధారణంగా ఎవరైనా సర్జరీ ద్వారా కొత్త అవయవాలను అమర్చుకుంటే.. వాటితో కొత్త పనులు చేయాలని ఆశిస్తూ ఉంటారు. అయితే యాక్సిడెంట్‌లో చేతులను కోల్పోయిన వ్యక్తి.. కొత్తగా అమర్చుకున్న చేతులతో చెయ్యాలనుకున్న పని నెటిజన్లను ఎమోషనల్‌గా ఫీలయ్యేలా చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఐస్‌ల్యాండ్‌కి చెందిన ఓ వ్యక్తి రెండు చేతులను పోగొట్టుకున్నాడు. తాజాగా అతడికి జీవన్మృతుడి చేతులను అమర్చారు. ఆ సర్జరీ సక్సెస్ ఫుల్ అయిందని వైద్యులు కూడా వెల్లడించారు. ఇప్పుడిప్పుడే తన చేతులను తిరిగి కదపగలుగుతున్నాడు. తన కొత్త చేతులతో అతడు.. ముందుగా తన భార్యను, ఆపై తన పిల్లలు, మనవలు, మనవరాళ్లను కౌగిలించుకోవాలనుకుంటున్నాడట.

ఐస్ ల్యాండ్ లోని క్పావోగర్ పట్టణానికి చెందిన ఎలక్ట్రిషియన్ ఫెలిక్స్ గ్రెటార్సన్.. 1998లో కరెంట్ లైన్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తుండగా షాక్ తగిలి తన రెండు చేతులను పోగొట్టుకున్నాడు. ఆ ప్రమాదంలో అతడి రెండు చేతులు పూర్తిగా కాలిపోయాయి. డాక్టర్లు దాదాపు 54 సర్జరీలు చేసి అతడిని కాపాడారు. మూడు నెలల పాటు కోమాలో ఉన్న తర్వాత బయటకు వచ్చినా చేతులకు గాయాలు ఎక్కువగా కావడం రెండు చేతులను భుజాల వరకు వైద్యులు తొలగించారు. ఆ తర్వాత తన చేతులు లేవన్న నిజం తట్టుకోలేక డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు ఫెలిక్స్.

అయితే 2007 లో యూనివర్సిటీ ఆఫ్ ఐస్ ల్యాండ్ లో ప్రముఖ సర్జన్ డా. జీన్ మైఖేల్ డబర్ నార్డ్ కి చెందిన లెక్చర్ ఉందన్న ఓ ప్రకటన టీవీలో చూశాడు. ఆయన అంతకుముందు విజయవంతంగా ఒక వ్యక్తి చేతిని తిరిగి అమర్చారు. ఆయనను కలిసి తన పరిస్థితిని వివరించాడు ఫెలిక్స్. డబర్ నార్డ్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంది కానీ అందుకోసం అతడు ఫ్రాన్స్ కి మారాల్సి ఉంటుందని చెప్పాడు. అప్పటి నుంచి తన చేతుల సర్జరీ చేయించుకోవడానికి అతడు చాలా ప్రయత్నించి డబ్బు సంపాదించాడు.



తను చేతులు కోల్పోయిన 23 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది జనవరి 12న ఫెలిక్స్ కి మరోసారి డబుల్ ఆర్మ్ ట్రాన్స్ ప్లాంట్ జరిగింది. పదిహేను గంటల పాటు ఈ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కొన్ని వందల గంటల పాటు అతడు చేతులు కదిలించేందుకు ప్రయత్నిస్తూ గడిపాడు. ఇప్పుడిప్పుడే తన చేతులను తిరిగి కదపగలుగుతున్నాడు. తన కొత్త చేతులతో ముందుగా తన భార్యను, ఆపై తన పిల్లలు, మనవలు, మనవరాళ్లను కౌగిలించుకోవాలనుకుంటున్నాడట.

"నా భుజాలపై రెండు ట్రక్కులు పార్క్ చేసినట్లుగా అనిపించింది. హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఇక నా జీవితం అయిపోయిందేమో అనిపించింది. కానీ కోలుకున్న తర్వాత ఆనందంగా రోజువారీ పనులు చేసుకోవచ్చని తెలిసింది. అయితే నా చేతులపై చర్మం ఉందని నాకు ఇంకా తెలియట్లేదు. నా మణికట్టును కేవలం నీళ్లలో ఉన్నప్పుడు మాత్రమే తిప్పగలుగుతున్నా. ఐదు నెలల తర్వాత ఇప్పుడు నా చేయి పనిచేస్తోంది. నా నరాల వ్యవస్థ పనిచేస్తుందని నాకు తెలుస్తోంది. కొన్ని రోజుల్లో నా చేతులు తిరిగి కదిలిస్తానని నాకు నమ్మకం ఉంది" అని ఫెలిక్స్ వెల్లడించాడు.
Published by:Sambasiva Reddy
First published: