Home /News /trending /

MAN FINDS HUMAN BABY SIZED BIG FROM IN SOLOMON ISLANDS HERE IS NITIZENS REACTIONS SK GH

Big Frog: వామ్మో.. చిన్న పిల్లాడి సైజులో భారీ కప్ప... మీరెప్పుడూ చూసి ఉండరు..

భారీ కప్ప

భారీ కప్ప

భారీ కప్పను చూసిన ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. తమ కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో విశేషంగా స్పందిస్తున్నారు. జురాసిక్ పార్క్ సినిమా నుంచి నేరుగా వచ్చిందని కొంతమంది కామెంట్ చేయగా.. ఇది అద్భుతమైన జీవిగా అభివర్ణించారు

కప్పలను చూస్తే చాలా మందికి చికాకుతో పాటు అసహ్యమైన భావన కలుగుతుంది. వీటిని సైజు చూసి భయపడేవాళ్లు లేకపోలేదు. అయితే చాలా వరకు మనకు కనిపించే కప్పలు చిన్నగా ఉంటాయి. మహా అయితే మనుషుల అరచేతి సైజు వరకు ఉంటాయి.  కానీ ఓ వ్యక్తి భారీ సైజులో ఉన్న కప్పను పట్టుకున్నాడు. చూసేందుకు ఇది మానవ శిశువు పరిమాణంలో ఉంది. ఓ పసిపాప నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట.  ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ రాకాసి కప్పను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవడమే కాకుండా విశేషంగా స్పందిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే... సోలమాన్ దీవుల్లో 35 ఏళ్ల జిమ్మీ హ్యూగో స్థానిక అడవుల్లో అడవి పందులను వేటాడుతుంటాడు. ఇందులో భాగంగా ఇటీవలే అడవీలో ప్రయాణిస్తుండగా భారీ సైజులో ఉన్న కప్ప కనిపించింది. దాన్ని చూసేంత వరకు ఎవరో శిశువు అని అనుకున్నాడు. అనంతరం కప్ప అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఈ కప్ప ఫొటోను పేస్ బుక్ లో పంచుకున్నాడు. కాల్ బుష్ చికెన్ అని శీర్షికను ఫొటో కింద ఉంచాడు. దీంతో కొన్ని గంటలకే ఈ ఛాయాచిత్రం వైరల్ అయింది. అంతేకాకుండా నెటిజన్ల నుంచి ఆశ్చర్యకరమైన స్పందనలు అందుకుంటున్నాడు.

"మొదట ఈ కప్పను చూసి నమ్మలేకపోయా. చూస్తుంది నిజమేనా అని అనుకున్నా. నా జీవితంలో నేను చూసిన అతిపెద్ద కప్ప ఇదే. ఇది మానవ శిశువు పరిమాణంలో ఉంది." అని హ్యూగో తన స్పందనను తెలియజేశాడు. కార్నుఫర్ గుప్పీ జాతికి చెందిన కప్పగా దీన్ని గుర్తించారు. ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కప్పల్లో ఉండే ఒకటి. ఇది సాధారణంగా న్యూ బ్రిటన్ నుంచి సోలమన్ దీవుల బిస్మార్క్ ద్వీప సమూహాల్లో కనిపిస్తుంది.

ఈ అసాధారణ భారీ కప్పను చూసిన ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. తమ కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో విశేషంగా స్పందిస్తున్నారు. జురాసిక్ పార్క్ సినిమా నుంచి నేరుగా వచ్చిందని కొంతమంది కామెంట్ చేయగా.. ఇది అద్భుతమైన జీవిగా అభివర్ణించారు. ఈ కప్ప గురించి మరింత సమాచారం తెలియజేయాలని ఇంకొందరు తమ పోస్టుల ద్వారా తెలిపారు. ఇది చాలా భయనకంగా ఉందని మరో ఔత్సాహికుడు తెలిపాడు. ఓ మై గడ్డ ఇది చాలా పెద్ద కప్ప అని ఇంకో వ్యక్తి తన స్పందనను తెలియజేశాడు.
బహుశా సోలమాన్ దీవుల్లో ఉన్న మెలనేషియాలో ఇదే అతిపెద్ద నీటి కప్ప అని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఇది కార్నుఫర్ గుప్పీ జాతికి చెందింది. బిస్మార్క్, సోలమాన్ దీవుల నుంచి మలైటా వరకు ఈ తరహా కప్పలు తమ భౌగోళిక పరిధిని కలిగి ఉంటాయి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: VIRAL NEWS, Viral post

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు