Viral Video: అంబులెన్స్ నుంచి పేషెంట్ పరార్.. పడుతూ లేస్తూ పరుగులు.. చూస్తే నవ్వాపుకోలేరు

అంబులెన్స్ నుంచి పారిపోతున్న పేషెంట్ (Image:Youtube/SpeedyFacts)

తనకు వైద్య సహాయం అక్కర్లేదంటూ అంబులెన్స్ నుంచి ఓ వ్యక్తి పారిపోయాడు. స్ట్రెచర్‌ పైనుంచి తప్పించుకొని వెళ్లిపోయాడు. కింద పడుతూ లేస్తూ పరుగులు పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
అనారోగ్యం బారిన పడితే వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరి రోగ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అనుకుంటాం. అంతేకానీ వైద్యం అందించే సిబ్బందికి దొరకకుండా తప్పించుకోవాలని ఎవ్వరూ అనుకోరు. కానీ అమెరికాలో ఓ వ్యక్తి మాత్రం.. తనకు వైద్య సహాయం అక్కర్లేదంటూ అంబులెన్స్ నుంచి పారిపోయాడు. స్ట్రెచర్‌పై నుంచి తప్పించుకొని వెళ్లిపోయాడు. కింద పడుతూ లేస్తూ పరుగులు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోను చూసి ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.

వీడియోను గమనిస్తే.. తెలుపు రంగు టీషర్ట్, ఖాకీ రంగు షార్ట్ వేసుకున్న ఓ వ్యక్తిని వైద్య సిబ్బంది అంబులెన్స్ లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంతలో అతడు అంబులెన్స్ స్ట్రెట్చర్ నుంచి కిందకు దిగి పరుగులు తీయడం ప్రారంభించాడు. వైద్య సిబ్బంది వారించే లోపే వారికి దొరక్కుండా తప్పించుకున్నాడు. అతడు ఓ బార్ వైపుగా పరుగుల తీసి మధ్యలో అడ్డుగా వచ్చిన ఓ వెయిటర్‌ను ఢీ కొట్టి ఏమి పట్టనట్లుగా వెళ్లిపోయాడు. వెయిటర్ చేతిలో ఉన్న ట్రేలోని వస్తువులు కూడా కింద పడ్డాయి.


80 మిలియన్లకుపై వీక్షణలు..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మెరెడిత్ షెరింగర్ అనే టిక్ టాక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. 'బక్స్ ఇన్ 6 బేబీ' అనే శీర్షికను ఉంచాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 80 లక్షల మందికి పైగా చూశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తికి ఆరోగ్య బీమాతో ముడిపెట్టి పోస్టులు పెట్టారు. అతడు బాగా తాగి ఉన్నాడని, వైద్య సహాయం అక్కర్లేదని అనుకుంటున్నాడని స్పందించారు. అయితే అతడు అంబులెన్స్ నుంచి ఎందుకు పారిపోయాడు.. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది.. ఆ వ్యక్తికి ఆరోగ్య సమస్యలేంటి.. అనే వివరాలు స్పష్టంగా తెలియదు.

అంబులెన్స్ బిల్లు కట్టలేకనా?
అమెరికాలో హాస్పిటళ్లకు అంబులెన్స్‌లో వెళ్లడానికి 450 డాలర్ల ఖర్చవుతుంది. అదే ఎయిర్ లిఫ్ట్ (హెలీ ప్యాడ్ ద్వారా) అయితే 21,000 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు నుంచి తప్పించుకునేందుకే అతడు వెళ్లిపోయాడని భావిస్తున్నారు. అతడికి అంబులెన్స్ బిల్లు చెల్లించడం ఇష్టం లేదని ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. అమెరికన్లకు ఆరోగ్య బీమా లేదని తెలుసుకోవాలని మరోకరు కామెంట్ చేశారు. అతడు ఢీకొట్టిన వెయిటర్‌కు మేనేజర్ చేతిలో తిట్లు తప్పవని ఇంకొకరు పోస్ట్ చేశారు.
Published by:Shiva Kumar Addula
First published: