కొంతమందికి అడవి జంతువుల జోలికి వెళ్లి వాటిని ఇరిటేట్ చేయడం బాగా అలవాటు. అలాంటి వారికి ఒక్కోసారి తగిన శాస్తి కూడా జరుగుతుంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి పనులు చేసినా.. ప్రమాదం నుంచి జస్ట్ వెంట్రుక వాసిలో తప్పించుకుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు.. ఇక మీరు మారరా అని అనాలని అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వారిపై నెటిజన్లు ఫైర్ అవుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో Instagram యొక్క waledalqasimi ఖాతాలో షేర్ చేయబడింది. అక్కడ బోనులో ఉన్న పులిని పదేపదే ఆటపట్టించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తాడు.
కానీ అనుకోకుండా ఇరుక్కుపోతాడు. కొద్దిసేపు అతడి ప్రాణాలు పైకిపోయినంత పనైంది. తన ధైర్యాన్ని చూపించే ప్రయత్నంలో, కడ్డీల లోపల చేతులు పెట్టడం ద్వారా, అతను కొన్నిసార్లు టైగర్ శరీరంపై వేళ్లను కుట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడు అతడి చేతులు బోను కడ్డీలలో ఇరుక్కుపోతాయి. అప్పుడు మనిషి పరిస్థితి భయం భయంగా మారింది. మొహంలోని అప్పటి ఉత్సాహం ఒక్కసారిగా ఎగిరిపోయింది.
బోనులో చిక్కుకున్న చేయి బయటపడటం కష్టమైంది. అయితే అతడి అదృష్టం బాగుంది. బోనులోని పులి ఈ ఆకతాయిని పట్టించుకోలేదు. కనీసం అతడి వైపు కూడా చూడలేదు. దీంతో అతడి చేయి బోనులో ఇరుక్కపోయినా.. పరిస్థితి ప్రమాదకరంగా మారలేదు. అతడు చేయి తీసుకోవడానికి కొన్ని క్షణాలు ప్రయత్నించాడు.
ఆ సమయంలో పులి పరధ్యానంలో ఉంది కాబట్టి.. అతడు తప్పించుకున్నాడు. ఈ వీడియో చూసిన వాళ్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు మరోసారి ట్రై చేసి చూడొచ్చుగా అంటూ సెటైర్లు వేస్తే.. పులితో ఆటలాడితే ఇలాగే ఉంటుందని మరికొందరు హెచ్చరించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.