Home /News /trending /

MAN DRAGS MUMBAI TRAFFIC COP ON CAR BONNET TO EVADE FINE IN MUMBAI VIDEO GOES VIRAL SU

Viral Video: వామ్మో.. రాంగ్ రూట్‌లో వచ్చాడని అడ్డుకుంటే.. ఏం చేశాడో చూడండి..

(Image-Twitter)

(Image-Twitter)

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం (Violating Traffic norms) పలు సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

    ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం (Violating Traffic norms) పలు సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని ట్రాఫిక్ పోలీసులు ఎన్నో రకాలుగా చెబుతున్నారు. కానీ చాలా మంది ఆ హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. కొందరు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో వారి ప్రాణాలనే కాదు, ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు హెచ్చిరికలను నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులుపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో (Mumbai) చోటుచేసుకుంది.

    ఓ వ్యక్తి రాంగ్‌ రూట్‌లో వస్తున్నాడని అడ్డుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌పైనే దాష్టికానికి దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయసింగ్ గురవ్ (Vijaysingh Gurav) అనే కానిస్టేబుల్ అంధేరిలోని(Andheri) ఆజాద్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో కారు రాంగ్ సైడ్ నుండి లోపలికి ప్రవేశించి ఎస్వీ రోడ్డు వైపు వెళ్లింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారుని నిలిపివేయాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ అడిగాడు. అయితే అందులో వ్యక్తి కానిస్టేబుల్‌ను వారిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని ఎలా అడ్డుకోవాలో తెలియన విజయ్‌ సింగ్ కారు బ్యానెట్‌పై ఎక్కి కూర్చున్నాడు.

    Post Office Scheme: రూ.50 వేలు డిపాజిట్ చేస్తే రూ.3,300 పెన్షన్.. పోస్టాఫీస్ పథకం ప్రయోజనాలివే..

    అయితే దానిని లెక్కచేయకుండా కారులోని వ్యక్తి హై స్పీడ్‌తో ముందుకు పోనిచ్చాడు. ఇలా ఏకంగా కిలో మీటర్‌కు పైగా దూరం దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో(Social Media) పోస్ట్ చేశారు.

    Married Woman: కొన్ని నెలల కిందట పెళ్లి చేసుకున్న యువతి.. ఆనందంగా సాగిపోతున్న కాపురం.. కానీ అలా జరగడంతో..




    ఈ ఘటనకు సంబంధించి విజయసింగ్ గురవ్ డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌కు (DN Nagar police station) వెళ్లి ఫిర్యాదు చేశాడు. కారు‌లో ఉన్న వ్యక్తి తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నాడని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ‘వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా మేము కారులో ఉన్న వ్యక్తిని ట్రాక్ చేశాం. త్వరలోనే అతని పట్టుకుంటాం’అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ సర్వెంట్ విధులను అడ్డుకోవడంతో అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Traffic fine, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు