Home /News /trending /

MAN DONATES KIDNEY TO GIRLFRIEND MOTHER SHE DUMPS HIM MARRIES SOMEONE ELSE PVN

Trending Love Story : ప్రేయసి కోసం కిడ్నీ దానం..నెల రోజుల తర్వాత మరొకరితో ప్రియురాలు జంప్

 ఉజెల్​ మార్టినెజ్ విఫల ప్రేమ కథ

ఉజెల్​ మార్టినెజ్ విఫల ప్రేమ కథ

Love Failure : ప్రేమంటేనే త్యాగం మరి. అయితే ఎన్ని త్యాగాలు చేసినా కొన్నిసార్లు ఆ ప్రేమ సఫలం కాకపోవచ్చు. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఉజెల్​ మార్టినెజ్ అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఇద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో ప్రేయసి తల్లికి ఒక కిడ్నీ చెడిపోయింది. దాంతో తన ప్రేయసి బాధను చూడలేకపోయాడు.

ఇంకా చదవండి ...
Love Failure  : ప్రేమ అనేది ఒక అనిర్వచనీయ అనుభూతి. తమ ప్రేమ చరిత్రలో నిలిచిపోయేందుకు.. కొందరు చారిత్రక కట్టడాలు నిర్మిస్తే.. మరికొందరు అదే ప్రేమను పొందడానికి యుద్ధాలుసైతం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకడం అనేది కష్టమైపోతుంది. ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. ప్రేమంటేనే త్యాగం మరి. అయితే ఎన్ని త్యాగాలు చేసినా కొన్నిసార్లు ఆ ప్రేమ సఫలం కాకపోవచ్చు. కొందరు పవిత్రమైన ప్రేమను తమ అవసరాలకోసం వాడుకుంటూ.. దిగజారీ ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రేమ ముసుగులో విచ్చలవిడిగా తిరిగి.. ఆ తర్వాత రకరకాల కారణాలతో విడిపోయి.. ప్రేమకున్న పరువును బజారుకిడుస్తున్నారు. ప్రేమను వాడుకోవడంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ అతీతులు కారు. కొన్నిచోట్ల అబ్బాయిలు.. అమ్మాయిలను మోసం చేస్తే.. మరికొన్ని చోట్ల అమ్మాయిలు.. అబ్బాయిలను మోసం చేస్తున్నారు.

కొందరు నిజమైన ప్రేమికులు తమ ప్రేమ కోసం.. తాము ప్రేమించిన వారి కళ్లలో ఆనందం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైన వెనుకాడటం లేదు. తాజాగా ఓ యువకుడు తన ప్రేయసి కోసం ఎవరు చేయలేని త్యాగం చేశాడు. ఏకంగా ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అయినప్పటికీ ఆ ప్రేయసి కరుణించలేదు. తన విఫల ప్రేమ కథ గురించి మెక్సికోకు చెందిన ఓ యువకుడు టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను తనప్రేమ కథ గురించి చెప్పగా..అది చాలా మంది గుండెలను కదిలిస్తోంది.

ALSO READ 67 ఏళ్లుగా స్నానమే చేయలేదు.. చెత్త కుప్పలో దొరికిందే భోజనం.. కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో చూడండి

టిక్ టాక్ వీడియోలో ఆ యువకుడు ఏం చెప్పాడు

మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఉజెల్​ మార్టినెజ్ ఒక స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయిని మార్టినేస్​ ప్రేమించాడు. అయితే ఇద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో ప్రేయసి తల్లికి ఒక కిడ్నీ చెడిపోయింది. దాంతో తన ప్రేయసి బాధను చూడలేకపోయాడు. తానే కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమయ్యాడు. అన్ని పరీక్షలు పూర్తవడం అతడి కిడ్నీ పేషంట్ కు సరిపోతుందని డాక్టర్ లు గుర్తించడంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిపోయింది. ప్రియురాలి తల్లి కోసం తన కిడ్నీ దానం చేసి గొప్ప ప్రేమికుడనిపించుకున్నాడు ఉజెల్​ మార్టినెజ్​. ఆ తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉంది. కానీ అంతలోనే ప్రియుడికి ప్రేయసి షాకిచ్చింది.

ALSO READ Supreme Court: కూతుర్ల‌కే ఫ‌స్ట్ చాన్స్‌.. ఆస్తి హ‌క్కుపై సుప్రీం కోర్టు తాజా తీర్పు!

కిడ్నీ దానం చేసిన కొన్ని వారాల తరువాత ఉజైల్ ప్రియురాలు మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇది తెలిసిన ఉజైల్‌కు మతి పోయింది. అయితే రీసెంట్ గా టిక్ టాక్ లో ఓ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ లో భాగంగా ఉజెల్ మార్టినెజ్ నకు ప్రేమలో ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించాడు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారంతా ఉజైల్ కోసం భావోద్వేగంగా కామెంట్లు పెడుతున్నారు. ఉజెల్ గర్ల్ ఫ్రెండ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంతో మంచి వ్యక్తిని ఆ అమ్మాయిని మిస్ చేసుకుందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని ప్రియురాలు చాలా దురదృష్టవంతురాలని ఒకరు కామెంట్ చేస్తే.. ఉన్న ఒక కిడ్నీ అయిన కాపాడుకోమని మరొకరు హాస్యం చేశారు. ఉజైల్ మాత్రం తాను జీవితంలో అన్ని మరిచిపోయి ముందుకు సాగిపోయానని.. తన ప్రియురాలిపై ఎటువంటి పగలేదని తెలిపాడు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Love failure, Love story, Trending videos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు