చెట్టెక్కి... చెట్టునే నరికాడు... రియల్ బాహుబలి ఫీట్... సూపర్ ఫన్నీ వైరల్ వీడియో

కొంతమంది తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో గానీ... తెలివి తక్కువ పనులతో ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. సినిమాల్లో గ్రాఫిక్స్ నిజం అనుకుంటే ఎలా? బాహుబలి ఫీట్ నిజంగా చేస్తే ఇలా అయ్యింది.

news18-telugu
Updated: September 27, 2020, 7:06 AM IST
చెట్టెక్కి... చెట్టునే నరికాడు... రియల్ బాహుబలి ఫీట్... సూపర్ ఫన్నీ వైరల్ వీడియో
చెట్టెక్కి... చెట్టునే నరికాడు... రియల్ బాహుబలి ఫీట్... సూపర్ ఫన్నీ వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
మీరు బాహుబలి 2 సినిమా చూశారా... అందులో... క్లైమాక్స్‌ యుద్ధ సమయంలో... తాటిచెట్లపైకి ఎక్కి... వాటిని వంచి... వదిలేస్తే... వాటిపై ఎక్కిన వారు... ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతూ... ప్రత్యర్థి కోటలోకి దూసుకెళ్తారు. అదంతా గ్రాఫిక్సే... నిజంగా అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని మనందరికీ తెలుసు. కానీ... ఓ వ్యక్తి... నిజంగానే అలా చేశాడు. ఓ పొడవాటి తాటి చెట్టు ఎక్కాడు. అప్పటికే ఆ చెట్టు... తన బరువు తానే మొయ్యలేక... ఓ పక్కకు ఒరిగి ఉంది. అలాంటి చెట్టు పైకి ఎక్కడంతో... అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. "చెట్టు విరిగిపోతే... చస్తాడు... ఎందుకెక్కాడో... దిగిపో దిగిపో" అని అరిచారు. అతను మాత్రం... చెట్టు పై దాకా ఎక్కి... అక్కడి పై భాగాన్ని చైన్ రంపంతో కోసేశాడు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లైంది పరిస్థితి. చెట్టు పై భాగం విరిగి కింద పడటంతో... ఒక్కసారిగా చెట్టు కాండానికి బరువు తగ్గిపోయింది. దాంతో చెట్టు ముందుకీ, వెనక్కీ ఊగుతుంటే... ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని... చెట్టుకి వేలాడాల్సి వచ్చింది. పొరపాటున పట్టు జారి ఉంటే... కిందపడేవాడే. సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో ఫన్నీగా ఉండటంతో... నెటిజన్లు తెగ నవ్వేస్తున్నారు.


ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన వాళ్లు కూడా పగలబడి నవ్వారు. "అక్కడి నుంచి పడితే ఇంకేమైనా ఉందా?" అనుకుంటూ ఆశ్చర్యపోయారు. వీడియోని పోస్ట్ చేసి వారు... "ఎవరైనా ఇంత పొడవైన తాటిచెట్టు పైకి ఎక్కి ఇలా కట్ చేస్తారా" అని క్యాప్షన్ పెట్టారు.

34 సెకండ్ల ఈ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. ఇప్పటికే దీన్ని 56 లక్షల మంది చూశారు. దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "ఎవరైనా ఎమ్యూజ్‌మెంట్ పార్క్ రైడ్ కావాలంటే ఇలా చెయ్యొచ్చు" అని ఓ యూజర్ కామెంట్ చెయ్యగా... "2020లో అతడు చావకపోతే... ఇక చావడు" అని మరో యూజర్ కామెంట్ చేశారు. రివర్స్ బంజీ జంప్ కంటే ఇది ప్రమాదకరమైనది అని మరొకరు అనగా... సరిపడా జీతం ఇవ్వలేదేమో... అందుకే ఇలా అంటూ మరొకరు సెటైర్ వేశారు. మొత్తానికి ఈ ఘటన బాహుబలి 2ని గుర్తుచేసింది.
Published by: Krishna Kumar N
First published: September 27, 2020, 7:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading