అడవిలో పెళ్లి రోజు వేడుకలు... షాక్ ఇచ్చిన కోతి... వైరల్ వీడియో...

వేడుకలకు అంతా సిద్ధమయ్యారు. ఓ రాయిపై కేకును ఉంచి... కోసేందుకు సిద్ధమైన సమయంలో... ఎవరూ ఊహించని పరిణామం క్షణాల్లో జరిగిపోయింది.

news18-telugu
Updated: July 11, 2020, 1:29 PM IST
అడవిలో పెళ్లి రోజు వేడుకలు... షాక్ ఇచ్చిన కోతి... వైరల్ వీడియో...
అడవిలో పెళ్లి రోజు వేడుకలు... షాక్ ఇచ్చిన కోతి... వైరల్ వీడియో...(credit - twitter)
  • Share this:
ఈ కథ మీకు గుర్తుందా. రెండు పిల్లులు బన్ కోసం కొట్టుకుంటుంటే... మధ్యలో ఎంటరైన కోతి... ఇద్దరికీ సమానంగా తాను పంచుతానని చెప్పి... ఆ రొట్టె మొత్తాన్నీ అది తినేసి పారిపోతుంది. ఇప్పుడు ఈ రియల్ స్టోరీలో దాదాపు అలాగే జరిగింది. ఇందులో కోతి... చాకొలెట్ కేకును ఎత్తుకుపోయింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద... ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి... తనకు పెళ్లై అయి సంవత్సరం పూర్తైన సందర్భంగా... అడవిలో చిన్న కేకు పార్టీ ఏర్పాటు చేశాడు. అందరూ చూస్తుండగా... ఓ రాయిపై చాకొలెట్ కేకు ఉంచి... చాకుతో ఓ ముక్కను కట్ చేశాడు.

ఆ ముక్కను ఎవరికో ఇవ్వబోతుంటే... అతని వెనక నుంచి వచ్చిన ఓ కోతి... కాళ్ల మధ్య నుంచి... రాయిని చేరి... ఈజీగా కేకు మొత్తాన్నీ లాక్కొని... చకచకా చెట్టెక్కేసింది. అంతే... పార్టీ కాస్తా... చెట్టెక్కినట్లైంది. కోతి అలా చేస్తుందని అస్సలు ఊహించని వారంతా... స్టన్ అయి దాన్ని చూస్తూ ఉండిపోయారు.


ఈ ఫన్నీ వీడియో అందరికీ తెగ నచ్చేస్తోంది. అడవిలో పార్టీలు పెట్టుకుంటే ఇలా అవుతుందని నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. అడవుల్లో పార్టీలకు సర్‌ప్రైజ్‌లు గ్యారెంటీ అని నందా కాప్షన్ పెట్టారు. జులై 9న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే... 32వేల మంది చూడగా... 3వేల మందికి పైగా లైక్ చేశారు.
నెటిజన్లు ఈ వీడియో చూసి బాగా నవ్వుతున్నారు. ఓ యూజర్ ఏం రాశారంటే... "కోతి: నువ్వు నన్ను పిలిచావా లేదా అన్నది నాకు అనవసరం. నేను ఎంటరైతే... అంతా నా కంట్రోల్‌లో ఉంటుంది." మరో యూజర్ ఏమన్నారంటే... అడవిలో జంతువులు ఉండటం కామన్ కాబట్టి... ఈ పార్టీకి అతనే అతిథిగా వచ్చినట్లు లెక్క అని అన్నారు. మరొకరు... "మంచి కోతి... ఆ కేకును కోసే వరకూ ఆగింది" అని రాశారు.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading