Viral Video : ఇదేందయ్యా ఇది..నేనాడా సూడలే..బార్బర్ షాప్‌కు వెళ్లి బోరున ఏడ్చిన కస్టమర్..

Photo Credit : Instagram

Viral Video : అదే షాపులో షవరం చేయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఎమోషనల్ అవుతూ.. ఏడవడం ప్రారంభించాడు. ఇది గమనించిన సెలూన్ వ్యక్తి అతనికి షవరం చేయడం ఆపేశాడు.

  • Share this:
    ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో కొన్ని రకాల వీడియోలు ఇట్టే వైరలవుతున్నాయ్. నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు దర్శనమిస్తుంటాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ ఫాంలో ఉన్నారు. ఏదైనా ఫన్నీ వీడియో కన్పిస్తే చాలు దాన్ని ట్రెండింగ్ చేసేస్తున్నారు. అయితే అందులో కొన్ని వీడియోలు వినోదాత్మకంగా ఉంటూ నవ్వులు పూయిస్తోన్నాయ్. ఇక జంతువులకు సంబందించిన వీడియోల సంఖ్య గురించి చెప్పాల్సిన పనే లేదు. తాజాగా ఓ వీడియో మాత్రం నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. అందులో ఓ వ్యక్తి గుట్టపెట్టి మరీ ఏడుస్తున్నాడు. కానీ ఆ వీడియో చూస్తే మాత్రం మనకు ఫుల్‏గా నవ్వొచ్చేస్తోంది. మరీ అతను అలా ఏడవడానికిగల కారణమెంటో తెలుసుకుందామా. ఓ బార్బర్ షాపులోకి వచ్చిన కస్టమర్లను అలరించడానికి అందులో కొన్ని సాంగ్స్ ప్లే చేస్తున్నాడు షాప్ ఓనర్. బాలీవుడ్ సాంగ్స్ వింటూ.. కస్టమర్లకు షవరం చేస్తున్నారు అక్కడివాళ్లు.

    ఇక అదే షాపులో షవరం చేయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఎమోషనల్ అవుతూ.. ఏడవడం ప్రారంభించాడు. ఇది గమనించిని సెలూన్ వ్యక్తి అతనికి షవరం చేయడం ఆపేశాడు. ఇంకేముంది.. ఆ వ్యక్తి మరింత ఎమోషనల్ అయ్యాడు. ఇలా చాలా సమయం వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తిని అంతగా ఏడిపించిన సాంగ్ ఏంటీ అనుకుంటున్నారా ?



    అది.. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, మాధురి దీక్షిత్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో 2002లో నటించిన హమ్ తుమ్హరే హై సనమ్ సినిమాలోని సబ్ కుచ్ భూలా దియా సాంగ్. ఇక ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పాపం ఆ వ్యక్తికి లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది.. అందుకే ఆ సాంగ్ కి కనెక్ట్ అయ్యాడంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: