Attack on Lion : సింహం ముఖంపై కేకుతో కొట్టాడు... తర్వాతేమైంది...

Twitter Viral Video : సింహం తలచుకుంటే మనిషి పని అయిపోయినట్లే. కానీ ఆ చిట్టి సింహం అతన్ని ఏమీ అనలేదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అతన్ని తిట్టి పోస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 16, 2019, 6:25 AM IST
Attack on Lion : సింహం ముఖంపై కేకుతో కొట్టాడు... తర్వాతేమైంది...
సింహం ముఖంపై కేకుతో కొడుతున్న బ్రిఫ్కానీ (Image : Twitter / Parimal Nathwani)
  • Share this:
కుర్దిష్ పర్సన్ బ్లెండ్ బ్రిఫ్కానీ... తన సింహానికి పుట్టిన రోజు వేడుక జరిపాడు. అంతవరకూ ఓకే. కానీ... మనుషులకు ఎలాగైతే పుట్టిన రోజు నాడు మొహంపై కేకుతో పూస్తారో... అలా... సింహం ముఖంపై కేకుతో కొట్టాడు. అంతా... ఆ కేకు సింహం కళ్లు, ముక్కు, ముఖమంతా అంటుకొని... అది చాలా ఇబ్బంది పడింది. అది పెంచుకుంటున్న సింహం కాబట్టి... బ్లెండ్ బ్రిఫ్కానీని ఏమీ అనకుండా, దాని దారిన అది బాధపడుతూ, కాళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ... ఉండిపోయింది. అదే ఏ బయట సింహమో అయివుంటే... ఈ పాటికి అతన్ని చీల్చి చెండాడేది. అయినా అది జంతువు. పుట్టిన రోజు అనేది ఒకటి ఉంటుందని కూడా దానికి తెలీదు. అలాంటి సింహానికి కేకుతో ముఖంపై కొట్టడం శాడిజం కాకపోతే ఏంటి?



ఈ వీడియో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆ సింహంలో సహన గుణం చూసి జాలిపడుతున్నారు. నిజమైన జంతువు ఎవరు? సింహమా... అతనా అని ప్రశ్నిస్తున్నారు.



ఎవడైనా ఇలా చేస్తాడా... వాడికి బుద్ధుందా... రేపు అందరూ తమ పెంపుడు జంతువులకు ఇలాగే చేస్తే... జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.



జంతు ప్రేమికులు ఈ చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నారు. కుక్కైనా, పిల్లైనా, సింహమైనా... పెంచుకుంటున్నామనే పేరుతో వాటిని హింసిస్తే సహించేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతెందుకు ఈ వీడియోని షేర్ చేసిన రాజ్య సభ ఎంపీ పరిమళ్ నథానీ కూడా ఈ చర్యను వ్యతిరేకించారు.



ఈ వీడియోలో బ్రిఫ్కానీ వెనకున్న గుంపు కూడా అతన్ని సమర్థిస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. వారందరిపైనా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కుర్దిష్ అమెరికన్ కోపరేషన్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న బ్రిఫ్కానీ ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకుంటాడని అనుకుందాం.
Published by: Krishna Kumar N
First published: June 16, 2019, 6:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading