హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

దూల తీర్చిన సెల్ఫీ సరదా.. చేపతో ఫోటో దిగిన తర్వాత ఏం జరిగిందంటే... షాకింగ్ వీడియో వైరల్..

దూల తీర్చిన సెల్ఫీ సరదా.. చేపతో ఫోటో దిగిన తర్వాత ఏం జరిగిందంటే... షాకింగ్ వీడియో వైరల్..

చేపతో సెల్ఫీ దిగుతున్న వ్యక్తి

చేపతో సెల్ఫీ దిగుతున్న వ్యక్తి

Viral video: సముద్రం మధ్యలో కొందరు బోట్ మీద షీకారుకు వెళ్లారు. ఇంతలో అందులో ఒక వ్యక్తికి, అరుదైన చేప చేతికి చిక్కింది. వెంటనే దానితో తెగ సెల్ఫీలు దిగాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన, ఏం ఘనకార్యం చేసిన, కొత్తది ఏమైన చూసిన వెంటనే సెల్ఫీ దిగేసీ సోషల్ మీడియాలోనో లేదాస్టేటస్ గా పెట్టుకుని, లైక్ ల తెగ తంటాలు పడుతుంటారు. మరికొందరు సెల్ఫీల కోసం తమ లైఫ్ ను కూడా రిస్క్ లో పడేస్తుంటారు. కొన్నిసార్లు.. తమకు కావాల్సిన ఫోటోల కోసం ముక్కు మోహం తెలియని వారికి కూడా ఫోన్ ఇచ్చి మరీ ఫోటోలకు పోజులిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు.. అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే.. కొందరు వ్యక్తులు సరదాగా బోట్ లో సముద్రంలోనికి వెళ్లారు. వారంతా లైఫ్ జాకెట్ లు వేసుకుని మరీ ఉన్నారు. అయితే.. వారిలో ఒక వ్యక్తికి అరుదైన చేప చేతికి చిక్కింది. వెంటనే తన తన ప్యాకెట్ లోని ఫోన్ ను బయటకు తీశాడు. ఆ తర్వాత.. వెంటనే అనేక యాంగిల్స్ లో, చేపతో ఫోటోలు దిగాడు. అంతే కాకుండా రకరకాల స్టిల్స్ తో పోజులిచ్చాడు. అయితే.. తన కోరిక తీర్చుకుని చివరకు చేపను సముద్రంలో వదిలేద్దామనుకున్నాడు.

అంతలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. అతని ఒక చేతిలో చేప, మరోక చెతిలో ఫోన్ ఉన్నాయి. కానీ అతను తత్తర పాటులో.. చెపను సముద్రంలో పడేయాల్సింది కాస్త.. మొబైల్ ఫోన్ ను పాడేశాడు. వెంటనే తెరుకుని నీళ్ల వంక షాక్ తో చూశాడు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఫోన్ నీళ్లలోనికి పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ గా (Viral video)  మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఊకో.. ఊకో.., కష్టాలు మనకే వస్తాయిలే.. అంటూ.. ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా న్యూఢిల్లీలో (Delhi) మరో పెంపుడు శునకం లిఫ్ట్ లో (Pet Dog) ఉన్న బాలుడిని కరిచిన సంఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (viral)  మారింది.

ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 75 లోని అపెక్స్ ఎథీనా సొసైటీలో సంభవించింది. కాగా, ఒక బాలుడు బయటకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కాడు. కానీ అందులో అప్పటికే ఒక వ్యక్తి, తన పెంపుడు శునకం జర్మన్ షిఫార్డ్ తో ఉన్నాడు. కుక్కను తాడుతో కట్టి, దాన్ని కంట్రోల్ చేయడానికి కర్రను కూడా పట్టుకున్నాడు.

ఆ తర్వాత.. యువకుడు వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చింది. అతను కుక్కను ముందుకు పోనిచ్చాడు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. కుక్క అమాంతం ఎగిరి బాలుడిపై దాడిచేసింది. అతడిని కోరికింది. వెంటనే దానిన యజమాని గట్టిగా వెనక్కు లాగాడు. కానీ అప్పటికే బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం దీనిపై స్థానికంగా రచ్చ జరుగుతుంది.

First published:

Tags: Fish, Ocean, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు