డ్రైనేజీలో 13 అడుగుల నాగుపాము... చూస్తే హడలిపోవాల్సిందే

ఆ నాగుపాము 15 కిలోల బరువు, 4 మీటర్ల పొడవు ఉంది. భారీ సర్పం జనావాసాల్లోకి వచ్చేసింది.

news18-telugu
Updated: October 22, 2019, 9:01 AM IST
డ్రైనేజీలో 13 అడుగుల నాగుపాము... చూస్తే హడలిపోవాల్సిందే
నాగుపాము
news18-telugu
Updated: October 22, 2019, 9:01 AM IST
పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. బాబోయ్ పాము అంటూ పరుగులు తీస్తాం. అదే అత్యంత విషపూరితమైన నాగు పాము కనిపిస్తే... ఇక అంతే సంగతులు. భయంతో గుండె గుబేలుమంటుంది. అలాంటిది ఏకంగా 13 అడుగుల నాగు పాము అక్కడ ఇక్కడ కాదు... డ్రైనేజీ పైపులో ప్రత్యక్షమైంది. అయితే దాన్ని చూసిన వారు పారిపోకుండా కాపాడారు. ఇది నిజం... సుమారు 15 కిలోల ఓ భారీ కోబ్రా థాయ్​లాండ్​లోని జనావాసాల్లో కనిపించింది. స్థానికుల సమాచారంతో అధికారులు ఆ సర్పాన్ని పట్టుకున్నారు.

దక్షిణ థాయ్‌లాండ్​లోని, క్రాబీ పట్టణంలో 13 అడుగుల అరుదైన భారీ నాగు పామును సహాయక సిబ్బంది పట్టుకున్నారు.ఆ నాగుపాము 15 కిలోల బరువు, 4 మీటర్ల పొడవు ఉంది. భారీ సర్పం జనావాసాల్లోకి వచ్చేసింది. దీంతో హడలిపోయిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. థాయ్‌లాండ్‌లో క్రాబీ పిటాక్‌ప్రాచా ఫౌండేషన్‌కు చెందిన సహాయక బృందంలో పామును పట్టడంలో నిపుణుడైన ఒకరు ఈ కింగ్​ కోబ్రాను డ్రైనేజీలో వెంబడించి మరీ పట్టుకున్నాడు. చేతులకు ఎలాంటి గ్లౌజులూ ధరించకుండా సాహసోపేతంగా సర్పాన్ని బంధించాడు.ఈ అరుదైన కింగ్​ కోబ్రాను వన్యప్రాణుల అభయారణ్యానికి తరలించారు అధికారులు.





First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...