Viral Video: కోడికి మలబద్ధకం.. ఏంటి బాబు అన్నావ్.. ఇంకోసారి చెప్పు.. అవాక్కయిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

Viral Video: అతడికి, పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ వీడియో తీసిన కొందరు.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • Share this:
    లాక్‌డౌన్ సమయంలో బయటకు వచ్చిన చాలామంది పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎన్నో కారణాలు చెబుతుంటారు. కొందరు మెడికల్ షాప్‌కు వెళుతున్నామని చెబితే.. మరికొందరు అత్యవసర పని ఉందని చెప్పి వారి నుంచి ఎలాగోలా బయటపడాలని భావిస్తుంటారు. కొందరు ఇంకా భిన్నమైన కారణాలు చెబుతూ లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేయడం అనేక చోట్ల కనిపించింది. అయితే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి లాక్‌డౌన్ సమయంలో బయటకు రావడానికి చెప్పిన కారణం విని పోలీసులు అవాక్కయ్యారు. కర్ణాటకలోని గడగ్‌లో ఓ వ్యక్తి లాక్‌డౌన్ సమయంలో బయటకు వచ్చిన పోలీసులకు దొరికిపోయాడు.

    లాక్‌డౌన్ సమయంలో ఎందుకు బయటకు వచ్చావంటూ పోలీసులు అతడిని ప్రశ్నించారు. దీంతో తన సంచితో ఉన్న కోడిని బయటకు తీసిన ఈ వ్యక్తి పోలీసులు ఊహించని సమాధానం చెప్పాడు. తన కోడికి మలబద్ధకం ఉందని.. అందుకే దాన్న ఆస్పత్రికి తీసుకెళ్లడానికి వెళుతున్నానని చెప్పాడు. మొదట అతడు చెప్పిన కారణం పోలీసులకు సరిగ్గా అర్థం కాలేదు. అయితే ఆ తరువాత అతడి చెప్పిన సమాధానం విని అవాక్కయిన పోలీసులు.. అతడి మాటలు విని కొద్దిసేపు నవ్వుకున్నారు.



    నీ కోడి సమస్యను ఇంటికి తీసుకెళ్లి పరిష్కరించుకో అంటూ అతడిని అక్కడి నుంచి పంపించేశారు. అయితే అతడికి, పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ వీడియో తీసిన కొందరు.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది కోడికి మలబద్ధకం అనే కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్లు ఈ వీడియోపై తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: