MAN CATCHES MASSIVE 14 FEET KING COBRA WITH BARE HANDS VIDEO FROM THAILAND GONE VIRAL MKS
Viral Video: వామ్మో! వట్టి చేతులతో భారీ కింగ్ కోబ్రాను వంచేశాడు.. దయచేసి మీరిలా చేయొద్దు..
చేతులతో భారీ పామును పడుతోన్న నౌహాడ్
ప్రతి సందర్భంలోనూ స్నేక్ క్యాచర్లు చివరన యు ఆకారం ఉండే సాధనంతోనే పాములు పడతారు. కానీ ఇదిగో, ఈ వ్యక్తి మాత్రం వట్టి చేతులతో పామును పట్టేశాడు. అదేమీ అల్లాటప్పా పాము కాదు.. 14 అడుగుల పొడవున్న భారీ కింగ్ కోబ్రా..
వాటి ఆకారమో, అవి కదిలే విధానమో, కాటేస్తే మరణం తప్పదనే భయమోగానీ విషపూరితంకాని పాములను చూసినా చాలా మంది ఒళ్లు జలదరిస్తుంది. పాము కనిపిస్తే కయ్యిన అరిచి పారిపోయేవాళ్ల జాబితాలో మనం కూడా ఉండొచ్చు. కానీ అన్ని జీవుల కెల్లా పాములంటేనే మనిషికి చాలా ఆసక్తి అట. నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ చానెళ్లు, యూట్యూబ్, ఇతర వీడియో మాధ్యమాల్లో పాముల వీడియోలకు అత్యధిక వ్యూస్ వస్తుండటమే అందుకు నిదర్శనమట. విషపూరితమైన పాములు జనావాసాల్లోకి వస్తే ప్రొఫెషనల్ స్నేక్ క్యాచర్లు లేదా స్నేక్ కన్జర్వేటివ్ వాలంటీర్లు వాటిని పట్టుకొని అడవుల్లో వదిలేస్తుండటం తెలిసిందే. ప్రతి సందర్భంలోనూ స్నేక్ క్యాచర్లు చివరన యు ఆకారం ఉండే సాధనంతోనే పాములు పడతారు. కానీ ఇదిగో, ఈ వ్యక్తి మాత్రం వట్టి చేతులతో పామును పట్టేశాడు. అదేమీ అల్లాటప్పా పాము కాదు.. 14 అడుగుల పొడవున్న భారీ కింగ్ కోబ్రా..
వట్టి చేతులతో కాలనాగును ఒడిసిపట్టుకున్న ఈ ఘటన తాజాగా థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. పాములు పట్టడంలో అరుదైన దృశ్యం కావడంతో ఈ వీడియో నెట్టింట వైరలైంది. స్థానిక క్రాబీ ప్రావిన్స్ ప్రాంతంలో ఈ మధ్యే పేద్ద పామొకటి జనావాసాల్లోకి ప్రవేశించింది. భారీ కింగ్ కోబ్రా బుసలు సూచి జనం హడలిపోయారు. వెంటనే పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. సూ నౌహాడ్(40) అనే స్నేక్ క్యాచర్ హుటాహుటిన అక్కడికొచ్చాడు. హడావుడిలో పాములు పట్టే కర్ర లేకుండానే వచ్చేశాడు. అయినాకూడా..
కింగ్ కోబ్రా బుసలకు, భయాక రూపానికి ఏమాత్రం బెదరకుండా వట్టి చేతులతోనే నౌహాడ్ ఆ పామును పట్టుకోగలిగాడు. ఆ పాము ఏకంగా 4.5 మీటర్ల(14 ఫీట్) పొడవు ఉంది. దాని బరువు 10 కిలోలు. అంత పెద్ద పాముని ఎంతో తెలివిగా, అస్సలు భయపడకుండా ఒట్టి చేతులతో పట్టేసిన వ్యక్తిని అంతా ప్రశంసిస్తున్నారు. 20 నిమిషాలు తిప్పలు పెట్టిన పాము.. ఒకానొక సమయంలో కాటేయబోయింది. తెలివిగా తప్పించుకున్న నౌహాడ్ చివరికి పాముని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి అడవుల్లో వదిలేశాడు.
అయితే, తన లాగా కర్ర సాయం లేకుండా వట్టి చేతులతో పాముని పట్టుకునేందుకు ఎవరూ ప్రయత్నం చేయొద్దని సూ నౌహాడ్ అభ్యర్థించాడు. వట్టి చేతులతో పామును పట్టాలనుకోవడం ప్రమాదకరమని, ఏ మాత్రం తేడా వచ్చినా పాము చేతిలో చావు ఖాయం అని హెచ్చరించాడు. తాను ఎన్నో ఏళ్లు పాములు పట్టడంలో శిక్షణ తీసుకున్నానని, ఆ విధంగా నైపుణ్యం సాధించానని వివరించాడు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.