కారులో వచ్చిన అతను ఎందుకలా చేశాడు?... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు...

రోడ్డుపై కారు ఆపిన అతను... అలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ... అనూహ్యమైనది అతను చేసి చూపించాడు. అందుకే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

news18-telugu
Updated: June 27, 2020, 11:47 AM IST
కారులో వచ్చిన అతను ఎందుకలా చేశాడు?... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు...
కారులో వచ్చిన అతను ఎందుకలా చేశాడు?... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు... (credit - Facebook)
  • Share this:
అదో రద్దీ ప్రాంతం. అక్కడ ఓ వ్యక్తి... కన్ని చిలకల్ని, పక్షుల్ని తన బుట్టలో బంధించి రోడ్డుపై అమ్ముతున్నాడు. అవి ఎలా తప్పించుకోవాలో తెలియక... అరుస్తూ.. గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఆ బుట్టకు చుట్టూ వల ఉండటంతో... ఆ చిట్టి ప్రాణాలు అందులోనే బంధీ అయి... తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంతలో... ఓ వ్యక్తి కారులో వచ్చాడు. ఒక్కో పక్షీ ఎంత అని అడిగాడు... అతను రేటు చెప్పాక... ఒక్కొక్కటీ తీసి ఇవ్వు అన్నాడు. అ పక్షుల్ని అమ్మే వ్యక్తి... బోను ఉందా మీ దగ్గర అంటే... అవసరం లేదు అన్నాడు. ఆ వ్యాపారికి మేటర్ అర్థం కాలేదు. సర్లే అనుకొని ఓ పక్షిని తీసి ఇచ్చాడు. ఆ పక్షిని కారులో వ్యక్తి పట్టుకుని వెంటనే వదిలేశాడు.

ఆ తర్వాత మరిన్ని పక్షుల్ని కూడా ఇలాగే వదిలేశాడు. ఐతే... అలా వదిలేసిన పక్షులకు అతనే మనీ చెల్లించాడు. అతని ఎన్ని పక్షుల్ని వదిలేశాడన్నది తెలియలేదు. ఈ వీడియో మాత్రం వైరల్ అయ్యింది.


చాలా మంది దీన్ని చూసి... గుడ్ మేన్ అని కారులో వచ్చిన వ్యక్తిని మెచ్చుకుంటున్నారు. అందరూ ఆయనలా ఉంటే... పక్షులు, మూగ జీవాలకు ఎలాంటి ఆపదా రాదంటున్నారు.
First published: June 27, 2020, 11:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading