MAN BUYS LOTTERY TICKETS FOR 34 YEARS DESPITE WIFE OBJECTION WINS TWO CRORES FIFTY LAKHS AT PUNJAB STATE LOTTERY PVN
Lottery : డబ్బులు ఊరికే రావు..భార్య వద్దని వారిస్తున్నా 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్ లు కొన్నాడు..చివరికి ఇంట్లో పట్టలేనంత డబ్బు
ప్రతీకాత్మక చిత్రం
Bumper Lottery Prize : అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు..! కానీ అదృష్టం ఒక్కసారి వరిస్తే మాత్రం ఒక్కసారిగా మన జీవితం మారిపోతుంది. ఓ సామాన్యుడి జీవితాన్ని ఇప్పుడు అదృష్టం వరించడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.
Bumper Lottery Prize : అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు..! కానీ అదృష్టం ఒక్కసారి వరిస్తే మాత్రం ఒక్కసారిగా మన జీవితం మారిపోతుంది. ఓ సామాన్యుడి జీవితాన్ని ఇప్పుడు అదృష్టం వరించడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. అతడిది మారుమూల గ్రామం. బట్టలకొట్టే జీవనధారం. దుస్తులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించాలి. వ్యాపారం అంతంత మాత్రమే ఉండటంతో అతడిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.
ఆర్థిక కష్టాలు వెంటాడుతన్న నేపథ్యంలోనే అతడికి ఓ ఆలోచన వచ్చింది. లాటరీ టికెట్ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని భార్యకు చెప్పాడు. అయితే ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. వద్దంటే వద్దు అని తెగేసి చెప్పింది. అయినా అతడు ఆగలేదు. డబ్బులు ఊరికే రావు అన్న కాన్సెప్ట్ తో..ఒక్క లాటరీ టికెట్ తోనే డబ్బులు ఏమీ రావు అని నిర్ణయించుకుని వీలు దొరికినప్పుడల్లా లాటరీ టికెట్(Lottery Ticket)లు కొన్నాడు. ఇలా భార్య వారిస్తున్నా పట్టించుకోకుండా 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్ లు కొంటూనే ఉన్నాడు. చివరికి ఇన్నాళ్లకు అదృష్ట దేవత అతడి తలుపు తట్టింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
పంజాబ్(Punjab)రాష్ట్రంలోని భటిండా జిల్లాలోని మెహ్రాజ్ గ్రామానికి చెందిన రోషన్ సింగ్ కు కొన్నేళ్ల క్రితమే ఓ మహిళతో వివాహం జరిగింది. మొదట్లో కుటుంబాన్ని పోషించేందుకు బట్టల దుకాణంలో పని చేసిన రోషన్ సింగ్.. 1987లో సొంతంగా దుస్తుల దుకాణాన్ని ప్రారంభించాడు. చిరుద్యోగి నుంచి సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకున్నా కుటుంబ అవసరాల కోసం రోషన్ పెద్దమొత్తాన్ని దాచుకోలేదు. సంపాదనలో అధిక మొత్తం లాటరీ టికెట్ల కొనుగోలుకు వెచ్చిస్తుండటంతో రోషన్ భార్య తరచూ అతడిని వారిస్తుండేది. 34 ఏండ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్న అడపాదడపా రూ 100, రూ 200 ప్రైజ్‌లతో సరిపెట్టుకునేవాడు. ఈ క్రమంలో సుమారు 34ఏళ్ల తర్వాత అతడిని అదృష్టం వరించింది. తాజాగా రోషన్ సింగ్ పంజాబ్ స్టేట్ డియర్ బైసాకి బంపర్ లాటరీ 2022(Punjab State Dear Baisakhi Bumper Lottery)లో ఏకంగా రూ.2.5కోట్లు గెలుపొందాడు.
బంపర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు డీలర్ రోషన్ కు ఫోన్ చేయగా అది ఫ్రెండ్ నుంచి వచ్చిన ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. తాము రాంపుర ఫుల్ లాటరీ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఏజెంట్ స్పష్టం చేయడంతో రోషన్ తన కల ఫలించిందని సంబరపడ్డాడు. ఏదో ఓ రోజు తాను లాటరీలో ప్రైజ్ గెలుచుకుంటానని కనీసం రూ 10 లక్షలైనా సొంతం చేసుకుంటాననే ఆశ ఉండేదని రోషన్ తెలిపాడు. మెగా ప్రైజ్ దక్కిందని తెలుసుకున్న రోజు రాత్రంతా తాము నిద్రించలేదని తెలిపాడు. ను నిజంగానే బంపర్ ఫ్రైజ్‌ను గెలిచినట్లు తెలిసి కుటుంబ సభ్యులు సహా స్నేహితులు సంతోషం వ్యక్తం చేసినట్టు చెప్పాడు. ట్యాక్స్ లు అన్నీ తీసేశాక తమకు రూ 1.75 కోట్లు వస్తాయని చెప్పాడు. ఈ మొత్తాన్ని తమ ముగ్గురు పిల్లల భవిష్యత్ కోసం వెచ్చించడంతో పాటు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పెట్టుబడిగా పెట్టనున్నట్లు రోషన్ సింగ్ చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.