Tik Tok: వీడియో కోసం... బంగారం లాంటి జీపును తగలబెట్టాడు

చూడటానికి ఎంతో చక్కగా ఉండే తన జీపును నిలబెట్టాడు. అందరూ చూస్తుండగానే.. పెట్రోల్ పోసి బంగారం లాంటి తన వెహికల్‌ను తగలబెట్టేశాడు.

news18-telugu
Updated: September 3, 2019, 3:59 PM IST
Tik Tok: వీడియో కోసం... బంగారం లాంటి జీపును తగలబెట్టాడు
చూడటానికి ఎంతో చక్కగా ఉండే తన జీపును నిలబెట్టాడు. అందరూ చూస్తుండగానే.. పెట్రోల్ పోసి బంగారం లాంటి తన వెహికల్‌ను తగలబెట్టేశాడు.
  • Share this:
టిక్ టాక్ పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిపోతుంది. కొందరు ఈ యాప్ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరికొందరు మాత్రం తమ వీడియోస్‌కు ఎక్కువ వ్యూస్, లైకులు రావాలని... సొంత ఆస్తుల్ని సైతం తగలబెట్టుకుంటున్నారు. గుజరాత్‌లో ఒకడు టిక్ టాక్ వీడియో కోసం ఇలాంటి ఘనకార్యమే చేశాడు. అది రాజ్‌కోట్‌లోని కొథారియా రోడ్డు. రద్దీగా ఉన్న ప్రాంతం. బిజీ బిజీగా జనం, అటు ఇటూ తిరుగుతున్నారు. వాహనాలు కూడా బాగానే రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఫైరింజన్ ఆఫీస్ కూడా ఆ రోడ్డులో ఉంది. ఇంతలో ఒకడు ఆ ఆఫీస్ ఎదుట చూడటానికి ఎంతో చక్కగా ఉండే తన జీపును నిలబెట్టాడు. అందరూ చూస్తుండగానే.. పెట్రోల్ పోసి బంగారం లాంటి తన వెహికల్‌ను తగలబెట్టేశాడు. చూసిన వాళ్లంతా వీడికి ఇదేం పిచ్చిరా అనుకున్నారా. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ఎక్కింది. పోలీసుల వరకు చేరింది.

దీంతో ఈ ఘటనకు పాల్పడిన ఇంద్రజీత్ జడేజా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జీపును ఎందుకు తగలబెట్టావంటూ ఆరా తీశారు. అతడు చెప్పిన కారణం విని పోలీసులు సైతం షాక్ అయ్యారు. టిక్ టాక్ వీడియో కోసమే ఇదంతా చేశానన్నాడు ఇంద్రజీత్. అంతేకాదు ఈ తతంగాన్ని మొత్తం  వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన అతడి స్నేహితుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పిచ్చి చేష్టలేంటంట.. నాలుగు తగిలించారు. టిక్ టిక్ యాప్ మీద దేశంలో కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి.

First published: September 3, 2019, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading