• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • MAN BECAME FATHER OF 35 CHILDREN DURING COVID 19 PANDEMIC HERE IS HOW BA GH

OMG: కరోనా టైంలో 35 మంది పిల్లల్ని కన్నాడు.. ఆ ‘మహానుభావుడు’ గురించి తెలుసుకోండి..

OMG: కరోనా టైంలో 35 మంది పిల్లల్ని కన్నాడు.. ఆ ‘మహానుభావుడు’ గురించి తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్​ సోకిన మగవారిలో వీర్య నాణ్యత దెబ్బ తింటుందని, వారిలో సంతానోత్పత్తిని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా సర్మ్​ డోనార్లకు డిమాండ్​ బాగా పెరిగింది.

  • Share this:
కరోనా వైరస్​ సోకిన మగవారిలో వీర్య నాణ్యత దెబ్బ తింటుందని, వారిలో సంతానోత్పత్తిని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా సర్మ్​ డోనార్లకు డిమాండ్​ బాగా పెరిగింది. తాజాగా, అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన 29 ఏళ్ల కైల్ గోర్డి అనే వ్యక్తి స్పర్మ్​ డొనేషన్​ ద్వారా 35 మంది పిల్లలను కన్నాడు. COVID-19 సంక్షోభం నేపథ్యంలో సంతానోత్పత్తి క్లినిక్​లలో వీర్యం​ కొరత కారణంగా కొంతమంది మహిళలు వీర్యం డొనేట్​ చేసే వారి కోసం సోషల్ మీడియాలో వెతుకుతున్నారని ఇటీవల అనేక నివేదికలు పేర్కొన్నాయి. దీంతో, వీర్యం​దాతలకు మంచి డిమాండ్ ఏర్పడటంతో ఎక్కువ మందిని ఆకర్షించేందుకు కొందరు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు.

ఇందులో భాగంగానే గొర్ణి రెండు స్పెర్మ్​ డొనేషన్​ ఫేస్​బుక్ గ్రూపులను నడుపుతున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితమే ప్రైవేట్ ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా స్పెర్మ్ డొనేషన్ యుఎస్‌ఎను సృష్టించాడు. ఇప్పుడు ఈ గ్రూపులో దాదాపు 15 వేల మంది సభ్యులు ఉన్నారు. ఆయన ‘స్పెర్మ్ డోనర్స్’ అనే మరో ఫేస్​బుక్ గ్రూపును కూడా నడుపుతున్నాడు. దీనిలో యుకెతో సహా ప్రపంచవ్యాప్తంగా 8,000 మంది సభ్యులు ఉన్నారు. సంతాన లేమితో బాధపడుతున్న వారు ఫేస్​బుక్ ద్వారా తనను సంప్రదిస్తే.. వారికి వీర్యం డొనేట్ చేస్తానని ప్రకటించాడు.

ఇలా సోషల్​ మీడియా ద్వారా స్మెర్మ్​ డొనేట్​ చేయడానికి ప్రయత్నించడం అనైతికమని, అటువంటి గ్రూప్​ అకౌంట్లను నిషేధించాలని యుకెకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఫేస్‌బుక్‌ను కోరింది. స్పెర్మ్​ డొనేట్​ చేయాలనుకునే వారు ప్రభుత్వ సంస్థలచే లైసెన్స్ పొందిన సంతానోత్పత్తి క్లినిక్‌లను మాత్రమే సంప్రదించాలని కోరింది. అలా కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా స్పర్మ్​ డొనేట్​కు ప్రయత్నిస్తే ఇద్దరికీ తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

స్పర్మ్​ డొనేట్​ గ్రూపులపై ఫేస్​బుక్​ ఏమంటుంది?
పార్ట్ టైమ్ అకౌంటెంట్​గా పనిచేస్తున్న గోర్డి, తన స్పెర్మ్ డొనేషన్​ కోసం ఎటువంటి రుసుము వసూలు చేయట్లేదు. దీనిపై గోర్డి మాట్లాడుతూ ‘‘స్పెర్మ్ బ్యాంకుల ద్వారా మనం ఎవరికి డొనేట్ చేస్తున్నామో తెలుసుకోలేం. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. అందువల్ల, స్పెర్మ్ బ్యాంక్​లా కాకుండా ప్రజలు నేరుగా దాతను ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలనుకున్నా. అందుకు అనుగుణంగా, రెండు ఫేస్​బుక్ గ్రూపులను సృష్టించాను. తద్వారా, నా స్పర్మ్​తో పిల్లలకు జన్మించిన చాలా మంది మహిళలతో నేను ఇంకా సంబంధంలో ఉండగలుగుతున్నా. నా సంతానంలో ఇప్పటి వరకు ఏడుగురిని కలుసుకోగలిగాను. సంతానం లేని వారికి చేసే ఈ సహాయం గొప్ప పనిగా భావిస్తున్నా” అని అన్నారు.

తాను మొదటిసారిగా 22 ఏళ్ల వయస్సులో లెస్బియన్ దంపతులకు స్పెర్మ్ దానం చేశానని గోర్డి చెప్పుకొచ్చాడు. అయితే, స్పెర్మ్​ డొనేషన్​ గ్రూపులకు ఫేస్​బుక్​ అనుమతివ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫేస్​బుక్ స్పందిస్తూ..‘‘ఫేస్​బుక్​లో స్పెర్మ్ దానం గురించి చర్చించడానికి మేము ప్రజలను అనుమతిస్తాము. కాని, స్థానిక చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్​ను కలిగి ఉంటే వాటిని తొలగించడానికి స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం.”అని స్పష్టం చేసింది.
First published:

అగ్ర కథనాలు