Viral Video: పాలలో వ్యక్తి స్నానం.. దెబ్బకు కంపెనీ బంద్.. వీడియో వైరల్

పాలలో స్నానం చేస్తున్న వ్యక్తి

Man take bath in Milk: తన స్నేహితుడు ఇలా పాల టబ్‌లో దిగి స్నానం చేయడాన్ని వీడియో తీసిన మరో వ్యక్తి... దీన్ని టిక్ టాక్‌లో షేర్ చేశాడు.

  • Share this:
    ఆలయాల్లో దేవుడి విగ్రహాలకు, గొప్ప వ్యక్తుల ఫోటోలు విగ్రహాలకు పాలతో అభిషేకం(క్షీరాభిషేకం) చేయడం చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి ఏకంగా పాలు ఉన్న టబ్‌లోకి దిగి స్నానం చేశాడు. పాలు ఉన్న టబ్‌లో దిగి స్నానం చేయాలనే తన కోరికను... తాను పని చేస్తున్న డెయిరీ ప్లాంట్‌లోనే తీర్చుకున్నాడు. తన స్నేహితుడు ఇలా పాల టబ్‌లో దిగి స్నానం చేయడాన్ని వీడియో తీసిన మరో వ్యక్తి... దీన్ని టిక్ టాక్‌లో షేర్ చేశాడు. ఇంకేముంది... ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాము ఎంతో నాణ్యమైనవని భావించే పాలలో ఈ రకంగా ఓ వ్యక్తి స్నానం చేయడాన్ని ప్రజలు తట్టుకోలేకపోయారు.

    రంగంలోకి దిగిన అధికారులు సదరు డెయిరీ ప్లాంట్‌ను మూసి వేయించారు. ఈ ఘటన టర్కీలోని కొన్యో ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ప్లాంట్‌కు జరిమానా విధించడంతో పాటు దాన్ని మూసి వేయించారు. పాలల్లో స్నానం చేసిన ఎమ్రీ సాయర్ అనే వ్యక్తితో పాటు అతడికి సంబంధించిన వీడియోను తీసిన ఉగర్ టర్గట్‌ను కూడా అరెస్ట్ చేశారు.



    దీనిపై స్పందించిన డెయిరీ కంపెనీ నిందితుడు పాలలో స్నానం చేయలేదని.. పాల లాంటి తెల్లటి మిశ్రమంలో స్నానం చేశాడని వివరణ ఇచ్చింది. కొందరు కావాలనే తమ కంపెనీ పేరును చెడగొట్టేందుకు ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. కంపెనీలో నిల్వ ఉన్న అన్ని పాల ఉత్పత్తులను ధ్వంసం చేయాలని ఆదేశించింది.
    Published by:Kishore Akkaladevi
    First published: