దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata banerjee) నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇప్పటికే హస్తిక చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. థర్ఢ్ ఫ్రంట్ అంటూ మమత అనేక రాజకీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంది. మరోవైపు వెస్ట్ బెంగాల్ లోని మంత్రి పార్థఛటర్జీపై ఈడీ దాడులతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. మమత ఢిల్లీ చేరుకుని మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, మమతా , పీఎం మోదీతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్లో MGNREGA, PM ఆవాస్ యోజన, GST బకాయిల గురించి ప్రధానంగా చర్చించారు. అదే విధంగా.. తన ఎంపీలతో.. గురువారం సమావేశమయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు మరియు 2024 లోక్సభ ఎన్నికల మార్గాన్ని చర్చించారు. ఇక మరుసటి రోజు.. మమతా నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా కలవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
MGNREGA, PM ఆవాస్ యోజన & PM గ్రామీణ సడక్ యోజన వంటి పథకాల అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులను అత్యవసరంగా విడుదల చేయాలని నేను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. ఈ పథకాలపై కేంద్ర ప్రభుత్వం నుండి బకాయిలు దాదాపు రూ. 17,996 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయని మమతా బెనర్జీకి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. “అనేక అభివృద్ధి & సంక్షేమ పథకాల ఖాతాలో గణనీయమైన మొత్తం సుమారు రూ. 1,00,968.44 కోట్లు కూడా బకాయి ఉంది… ఇంత పెద్ద మొత్తం మిగిలి ఉన్నందున, రాష్ట్రం వ్యవహారాలను నిర్వహించడానికి , ప్రజలను జాగ్రత్తగా చూసుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆమె తెలిపారు.
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు మమత నాలుగు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధానికి చేరుకున్నారు. ఆగస్టు 7న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆమె హాజరవుతారు. వ్యవసాయం, ఆరోగ్యం మరియు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు చర్చించబడే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని ఆగస్టు 7న ప్రధాని మోదీ నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Mamata Banerjee, Pm modi