రొమాన్స్‌కి ఓకే...బాబోయ్ పిల్లలు మాత్రం కనలేనంటున్న మల్లికా షెరావత్

Mallika Sherawat | తల్లికి చాలా బాధ్యతలు ఉంటాయని, వాటిని తలచుకుంటేనే భయమేస్తోందని చెప్పింది బాలీవుడ్ ఐటమ్ గర్ల్ మల్లికా షెరావత్. అందుకే పిల్లలను కనేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టంచేసింది.

news18-telugu
Updated: September 19, 2019, 3:24 PM IST
రొమాన్స్‌కి ఓకే...బాబోయ్ పిల్లలు మాత్రం కనలేనంటున్న మల్లికా షెరావత్
మల్లికా శెరావత్ (File)
  • Share this:
బాలీవుడ్‌ ఐటమ్ గర్ల్ మల్లికా షెరావత్‌కి పిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకే బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా తన సోదరుడి తనయుడి కోసం ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయిస్తోంది. తనకు పిల్లలు లేరుకానీ...రన్షీర్ తన సొంత బిడ్డతో సమానమని చెబుతోంది. అతనితో ఆడుకోవడం, ట్రావెల్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అంత వరకు ఓకే కానీ...బిడ్డకు డయాపర్లు మార్చడం మాత్రం తనవల్ల కాదని నవ్వుతూ చెప్పేసింది 42 ఏళ్ల మల్లిక.

పిల్లలంటే మీకు చాలా ఇష్టం కదా...మీరెప్పుడు అమ్మ అవుతారని ప్రశ్నిస్తే...అందుకు తాను సిద్ధంగా లేనని చెప్పింది మల్లికా షెరావత్. పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయమని, అందుకు తాను పిల్లలు కనేందుకు సిద్ధంగా లేనని స్పష్టంచేసింది.
 Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Beat the #mondayblues by singing to your nephew/ niece 🐥 @ransherlamba #mondaymood


Mallika Sherawat (@mallikasherawat) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


‘అమ్మ’ బాధ్యతలను గుర్తుచేసుకుంటే తనకు భయమేస్తుందని చెప్పింది. పిల్లలుంటే మనం ఎక్కడికెళ్లిన సూట్‌కేసులు మోసుకెళ్లాలి. అందుకే పిల్లలు కనుక్కోవడం నావల్ల కాదని చెబుతోంది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత...మన ఆలోచనలంతా ఆ బిడ్డపైనే పెట్టాల్సి ఉంటుందని..కాస్త పెరిగాక ఏ స్కూల్లో చేర్పించాలి...ఇలా అన్ని బిడ్డ గురించే ఆలోచించాల్సి ఉంటుందని పేర్కొంది. వామ్మో...ఇదంతా తనవల్ల అయ్యేపని కాదని...ప్రస్తుతం తాను ఎలా ఉన్నానో...అదే సంతోషాన్ని ఇస్తోందని వ్యాఖ్యానించింది.

పిల్లలను కనుక్కోవడానికి సిద్ధంగా లేకున్నా...రొమాన్స్‌కి మాత్రం తాను సిద్ధమేనని మల్లికా షెరావత్ స్పష్టంచేసింది. కొంతకాలం పాటు ఫ్రాన్స్ బిజినెస్‌మెన్ క్రిల్లి అక్సెన్‌ఫాన్స్‌తో డేటింగ్ చేసిన మల్లికా షెరావత్..మళ్లి ప్రేమలో పడేందుకు తాను సిద్ధమేనని చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్‌‌ అని చెప్పిన బాలీవుడ్ భామ...రొమాన్స్‌లో మజాను ఆశ్వాదించడం తనకు ఇష్టమేనని చెప్పింది. బాలీవుడ్‌లో నటీమణులు సింగిల్‌గా ఉండడం ఇబ్బందికరమేమీ కాదని చెప్పుకొచ్చింది. అయినే కొందరు సినీ తారలను నీచంగా చూస్తుంటారని...అది సరికాదని పేర్కొంది. తాను మాత్రం తన గురించి ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోనని స్పష్టంచేసింది. తనకు నచ్చినట్లు తాను జీవిస్తున్నానని మల్లికా షెరావత్ స్పష్టంచేసింది. 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Weekending wt my little nephew @ransherlamba 🐥 #family #saturdayvibes #weekendmood


Mallika Sherawat (@mallikasherawat) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Published by: Janardhan V
First published: September 19, 2019, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading