Malaysian woman minister : గృహ హింసను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సమాజంలో మార్పు మాత్రం పెద్దగా కనిపించడంలేదు. బాగా చదువుకున్నోళ్లు కూడా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఒకరంగా చెప్పాలంటే చదువుకున్నోళ్లే ఎక్కువగా మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు ఆడవాళ్లకు అండగా ఉండాల్సిన పాలకులు, అధికారులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. అత్యున్నత పదవిలో ఉన్నవాళ్లు మాట్లాడేటప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్లు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గానీ వాళ్లు ఎటువంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగురకతతో వ్యవహరించాలి. కానీ స్వయంగా ఓ మహిళా డిప్యూటీ మంత్రి..భార్యలను కొట్టవచ్చు భర్తలకు సలహా ఇస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి.
మలేషియాకు చెందిన ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ డిప్యూటీ మినిస్టర్ సిటి జైలా మొహమ్మద్ యూసోఫ్(Siti Zailah Mohd yusoff)'మదర్స్ టిప్స్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో మంత్రి సిటి జైలా మొహమ్మద్ యూసోఫ్...మొండిగా ఉండే భార్యలను కొట్టాలని భర్తలకు సలహ ఇచ్చింది. ఆ వీడియోలో మంత్రి మాట్లాడుతూ... "మొండి భార్యలను వారితో మాట్లాడటం ద్వారా "క్రమశిక్షణ"గా ఉంచాలి. మాట్లాడిన తర్వాత కూడా భార్యలు తమ ప్రవర్తనను మార్చుకోకపోతే, మూడు రోజులు వారి నుండి భర్తలు దూరంగా పడుకోవాలి. అప్పటికి కూడా భార్యలు తమ ప్రవర్తనను మార్చుకోకుంటే.. సున్నితంగా వారిని భర్తలు కొట్టవచ్చు. భార్యపై భర్త అతని కఠినత్వాన్ని మరియు ఆమెను ఎంతగా కోరుకుంటున్నాడో చూపించవచ్చు. అంతేకాకుండా మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి" అని పాన్-మలేషియన్ ఇస్లామిక్ పార్టీకి చెందిన ఎంపీ అయిన సిటి జైలా మొహమ్మద్ యూసోఫ్.. భర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చింది.
ALSO READ Brutal Assault : ప్రశ్నించిన పాపానికి..మహిళలను చేతులు కట్టేసి కొట్టిన పోలీసులు!
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీంతో ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఆమె వ్యాఖ్యలు గృహ హింసను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఈ ప్రపంచంలో ఎవరికీ మరొకరిని కొట్టే హక్కు లేదు.. మీరు డిప్యూటీ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు... వెంటనే రాజీనామా చేయండి అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యల వ్యవహారం జాయింట్ యాక్షన్ గ్రూప్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ, మహిళా హక్కుల సంఘాలకు చేరింది. దీంతోవారు కూడా మహిళా మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమె పదవికే ఎసరు తెచ్చిపెట్టాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.