హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

9 ఏళ్ల పాటు డేటింగ్.. ప్రియురాలికి గిఫ్ట్ గా ఇచ్చిన కారులో.. మరో యువకుడు..

9 ఏళ్ల పాటు డేటింగ్.. ప్రియురాలికి గిఫ్ట్ గా ఇచ్చిన కారులో.. మరో యువకుడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Viral news: ఇద్దరు ప్రేమించుకున్నారు. 9 ఏళ్ల కాలంలో మొదట స్నేహంగా ఉన్న వీరి బంధం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్లేవారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

కొందరు స్వార్థపరులు పవిత్రమైన ప్రేమను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఎదుటివారిని ప్రేమిస్తున్నామని చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. ఆ తర్వాత.. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. మరికొందరు ఒకరికి తెలియకుండా మరికొందరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. దీనిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఏమాత్రం తీసిపోవడం లేదు. అదేదో కొంత మంది అమ్మాయిలైతే.. లవర్స్ ను ఏదో స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. ఎంత మంది లవర్ లు ఉన్నారంటూ.. తమను ఎంత మంది ఫాలో అవుతున్నారో ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకుంటూ పోజులు కొడుతున్నారు. మరికొందరు ఒకరితో... ఉంటునే మరోకరితోను ఎఫైర్ (love affair) కొనసాగిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా (viral) మారింది.

పూర్తి వివరాలు.. మలేషియాకు (Malaysia)  చెందిన ఒక యువతీ, యువకుడు 9 ఏళ్లపాటు డేటింగ్ లో (Dating) ఉన్నారు. అయితే... వీరి మధ్య చిన్నపాటి గొడవలు వచ్చాయి. దీంతో ఇద్దరు విడిపోయారు. అయితే.. యువకుడు మాత్రం... తన ప్రేయసీ కి లవ్ లో ఉన్నప్పులు అనేక కాస్లీ గిఫ్ట్ లు ఇచ్చాడు. తన ప్రియురాలికి ఇష్టమైన ఏకంగా ఆమెకు నచ్చిన కారునే బహుమతిగా ఇచ్చాడు. కానీ విడిపోయిన తర్వాత.. అవేవి తీసుకొలేదు. తన గుర్తులుగా వాటిని చూసుకుంటూ ఏప్పటికైన తిరిగివస్తుందని ఆశపడ్డాడు.

అయితే.. ఆమెలో ఏలాంటి మార్పు రాలేదు. అంతే కాకుండా హ్యాపీగా మరో యువకుడిని సెట్ చేసుకుంది. తన మాజీ లవర్ ఇచ్చిన కారులో మరో యువకుడితో కలిసి కారులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతుంది. ఇది కాస్త యువకుడి కంట పడింది. దీంతో అతను తన మాజీ ప్రియురాలి దగ్గరకు వెళ్లి తన కారు రిటర్నై ఇచ్చేయాలని అడిగాడు. అంతే కాకుండా ఆమెతో రిలేషన్ లో ఉన్నప్పుడు తీసుకున్న ప్రతి ఒక్క గిఫ్ట్ తిరిగి ఇచ్చేయాలంటూ ఆమెను డిమాండ్ చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Love affair, Malaysia, VIRAL NEWS

ఉత్తమ కథలు