హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇమ్రాన్ చేయి పట్టుకుని మురిసిపోయిన 92 ఏళ్ల వృద్ధురాలు

ఇమ్రాన్ చేయి పట్టుకుని మురిసిపోయిన 92 ఏళ్ల వృద్ధురాలు

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మలేసియా ప్రధాని మంత్రి, మలేసియా తొలి మహిళ సితీ ( Image Courtesy : Twitter )

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మలేసియా ప్రధాని మంత్రి, మలేసియా తొలి మహిళ సితీ ( Image Courtesy : Twitter )

పాక్ ప్రధాని చేయి పట్టుకుని ఫోటో దిగాలని ఓ 92 ఏళ్ల వృద్ధురాలు పడిన ఆరాటం...ఇమ్రాన్ చేయి పట్టుకున్న ఆమె సంబర పడిపోయిన విధానం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌‌కు అప్పట్లో క్రేజ్ ఏ రేంజ్‌లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మాజీ క్రికెట్ దిగ్గజానికి 90వ దశకంలో మహిళా అభిమానుల సంఖ్యే ఎక్కువ. ఇమ్రాన్ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని మలేసియాలో జరిగిన ఓ సంఘటన‌తో మరోసారి రువువైంది. పాక్ ప్రధాని చేయి పట్టుకుని ఫోటో దిగాలని ఓ 92 ఏళ్ల వృద్ధురాలు పడిన ఆరాటం...ఇమ్రాన్ చేయి పట్టుకున్న ఆమె సంబర పడిపోయిన విధానం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.


రీసెంట్‌గా ఈ పాక్ ప్రధాని మలేసియాలో పర్యటించాడు. మలేసియా ప్రధాని మహాతిర్ బిన్ మహ్మద్‌‌‌తో కలిసి ఫోటో దిగబోతుండగా...ఆ దేశ తొలి మహిళ, ప్రధాని సతీమణి సితీ హస్మా... పాక్ ప్రధానిని చేయి పట్టుకుని ఫోటో దిగొచ్చా అని కోరారు. ఇమ్రాన్ నవ్వుతూ అంగీకరించగా...తన అభిమాన క్రికెటర్‌ చేయి పట్టుకుని 92 ఏళ్ల సితీ హస్మా సంబరపడిపోయింది. ఇమ్రాన్ చేయి పట్టుకున్న తర్వాత చిన్నపిల్లలా మురిసిపోతూ..ముసిముసి నవ్వులూ నవ్వుకుంటూ ఉబ్బితబ్బిబయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది.

ప్రస్తుత పాకిస్థాన్ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్...మాజీ క్రికెటర్ అని అందరికీ తెలిసిందే. పాకిస్థాన్‌కు వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ఇమ్రాన్‌కు ఆ రోజుల్లోనే ఫిమేల్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉండేది.

First published:

Tags: Malaysia, Pakistan, Viral Videos

ఉత్తమ కథలు