హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఒక్క పనితో దుబాయ్‌లో స్టార్‌గా మారిన భారత యువకుడు.. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

ఒక్క పనితో దుబాయ్‌లో స్టార్‌గా మారిన భారత యువకుడు.. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

జాఫర్

జాఫర్

ఒక్క పనితో యూఏఈలో స్టార్‌గా మారాడు ఓ భారత యుకుడు. ఉపాధి వెతుక్కోవడానికి దుబాయ్ వెళ్లిన అతడు.. ఇప్పుడు అక్కడి ఇండియన్స్ దృష్టిలో హీరో అనిపించుకున్నాడు.

యూఏఈ‌లో స్టార్ అనిపించుకున్నాడు భారతీయ యువకుడు. దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తిని చాలా తెలివిగా పట్టుకున్నాడు. దీంతో ఒక రోజులోనే గల్ఫ్‌లోని మలయాళీల దృష్టిలో హీరో అయిపోయాడు. వివరాలు.. కేరళలోని వడకరకు చెందిన జాఫర్ ఉపాధి వెతుక్కోవడానికి విజిటింగ్ వీసాపై దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మరోవైపు బంధువులకు చెందిన జ్యూస్ షాప్‌లో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న జ్యూస్ షాప్‌కు సమీపంలో ఓ గిఫ్ట్ షాప్ వద్ద.. భారత్‌కు చెందిన ఓ యువకుడు డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్తున్నాడు. ఇది గమనించిన ఓ దొంగ.. అతని చేతిలో నుంచి రూ. 80 లక్షలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇది దొంగతన చూసిన జాఫర్ బంధువు నజీబ్ గట్టిగా కేకలు వేశాడు.

నజీబ్ అరుపుల శబ్దం విన్న జాఫర్ షాప్‌లో నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాడు. అప్పుడు ఓ వ్యక్తి షాపు ఎడమ వైపు నుంచి వేగంగా పరిగెట్టడం చూశాడు. ఆ సమయంలో కూడా నజీబ్ దొంగ అని అరుస్తూనే ఉన్నాడు. దీంతో సమయస్పూర్తిని ప్రదర్శించిన జాఫర్.. వెంటనే పరుగుపెడుతున్న దొంగకు తన కాలు అడ్డం పెట్టాడు. దీంతో దొంగ కిందపడిపోయాడు. ఆ తర్వాత కూడా ఆ దొంగ లేచి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో జాఫర్ అతనిపైకి దూకి పట్టుకున్నాడు.

ఆ తర్వాత దొంగ వెనకాల వచ్చిన వారు.. అంతా కలిసి అతడిని దుబాయ్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ దొంగ రిమాండ్‌లో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు జాఫర్‌తో పాటు మరికొందరి స్టేట్‌మేంట్ రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. గల్ఫ్ మాలయాలీలలో హీరో అయిపోయాడు. సోషల్ మీడియాలో కూడా స్టార్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతని మంచి ఉద్యోగం చూపించేందుకు పలు మలయాళీ సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

First published:

Tags: Kerala, UAE

ఉత్తమ కథలు