Tik Tok : మెదడు వ్యాధితో చనిపోయిన మలయాల టిక్ టాక్ స్టార్ ఆరుణి కురూప్...

Aaruni Kurup : టిక్ టాక్ వీడియోలు చూసే కేరళీయులకు ఆరుణి ఎస్. కురూప్ పరిచయమే. తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న చిన్నారి ఆరుణీ... గుర్తు తెలియని వ్యాధితో చనిపోవడం విషాదకరం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 7:52 AM IST
Tik Tok : మెదడు వ్యాధితో చనిపోయిన మలయాల టిక్ టాక్ స్టార్ ఆరుణి కురూప్...
ఆరుణి కురూప్ (Image : Youtube - Akhil Global Media)
Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 7:52 AM IST
సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా... ఇప్పటికీ కొన్ని వ్యాధులకు చెక్ పెట్టలేకపోతున్నాం. కొన్నింటిని గుర్తించడం కూడా కష్టమవుతోంది. చైల్డ్ యాక్టర్ ఆరుణీ కురూప్ విషయంలో అదే జరిగింది. టిక్ టాక్‌లో ఎన్నో వీడియోలు చేసి... తన టాలెంట్ చూపించి... 9 ఏళ్ల వయసులోనే అశేష అభిమానులను సంపాదించుకుంది. ఈ చిన్నారి మృతి చెందినట్లు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ బిహైండ్ వుడ్స్ తెలిపింది. ఆ రిపోర్ట్ ప్రకారం... ఆరుణి మెదడులో గుర్తు తెలియని వ్యాధి ఏదో సోకింది. చివరకు అది ఆమె ప్రాణాలు తీసింది. కొన్ని రోజులుగా పాపకు జ్వరం, తలనొప్పి వచ్చాయి. ఆ బాధ భరించలేకపోతున్న ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత అక్కడి నుంచీ త్రివేండ్రంలోని S.I.T. ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించింది. ట్రీట్‌మెంట్ జరుగుతుండగానే ఆరుణి అనంతలోకాలకు వెళ్లిపోయింది.

యూట్యూబ్‌లో ఆరుణి టిక్ టాక్ వీడియోలకు లెక్కలేదు. వాటన్నింటికీ వ్యూస్ కూడా ఎక్కువే. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఈ బంగారు కొండ... ఎంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమెకు వచ్చేవన్నీ ప్రశంసల కామెంట్సే. ఆరుణికి సంబంధించి ప్రొఫైల్ సమాచారం పెద్దగా బయటకు రాలేదు. ఆమె నాలుగో తరగతి చదువుతోందని తెలిసింది. గతేడాది సౌదీ అరేబియాలో జరిగిన ఓ ప్రమాదంలో ఆరుణి తండ్రి చనిపోయారు. ఇప్పుడా పాప కూడా ఇక లేదనే వార్తను తట్టుకోలేకపోతోంది ఆరుణి కుటుంబం.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...