ప్రతి ఒక్కరికీ రెండో ఛాన్స్ ఇవ్వాలి...అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌పై మలైకా కామెంట్స్

Bollywood News- Malaika Arora | ప్రేమ విషయంలో ప్రతి ఒక్కరికీ రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు బాలీవుడ్ నటి మలైకా అరోరా వ్యాఖ్యానించింది.

news18-telugu
Updated: July 29, 2019, 11:19 AM IST
ప్రతి ఒక్కరికీ రెండో ఛాన్స్ ఇవ్వాలి...అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌పై మలైకా కామెంట్స్
మలైక అరోరా (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)
news18-telugu
Updated: July 29, 2019, 11:19 AM IST
బాలీవుడ్ నటి మలైకా అరోరా బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తున్నది తెలిసిందే. గత రెండేళ్లుగా వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరు మధ్య రిలేషన్‌షిప్‌ను కన్ఫార్మ్ చేసేలా వారు సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ హీరో అర్బాజ్ ఖాన్‌తో ఆమెకు 16 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె...అర్జున్ కపూర్‌కు దగ్గరయ్యారు. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే తన కంటే దాదాపు పదేళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా ప్రేమాయణం సాగించడంపై  కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా సెటైర్స్ వేస్తున్నారు.

కాగా అర్జున్ కపూర్‌తో తన రిలేషన్‌షిప్‌తో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన మలైకా అరోరా...ప్రతి ఒక్కరికీ రెండో ఛాన్స్ ఉండాలని వ్యాఖ్యానించింది. ప్రేమకు రెండో అవకాశం ఇవ్వడాన్ని దేశంలో దురాచారంగా భావిస్తున్నారని, ఇది సరికాదని అభిప్రాయపడింది. రెండో ప్రేమకు సంబంధించినంత వరకు సున్నితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రేమ విషయంలో ప్రతి ఒక్కరికీ రెండో అవకాశం ఉండాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది.


 

Loading...


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor ... love n happiness always


Malaika Arora (@malaikaaroraofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


మీడియా తమ వెంటపడడాన్ని ప్రస్తావిస్తూ త్వరలోనే మీడియాకు ప్రశాంతత కలిగించనున్నట్లు మలైకా అరోరా వ్యాఖ్యానించింది. మీడియా అత్యుత్సాహాన్ని ప్రస్తుతం తాము పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Congratulations @reebokclassicindia @reebokindia for the supa launch on the 1st ever store in India #fithub3.0 .... #hair @bbhiral #mua @g.luca_makeup @ektakauroberoi


Malaika Arora (@malaikaaroraofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
 
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Felt like #throwback on a Friday ..... 📸 @farrokhchothia


Malaika Arora (@malaikaaroraofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...