Home /News /trending /

Kerala Governor: కట్నం తీసుకోబోమని సంతకాలు చేస్తేనే డిగ్రీ సర్టిఫికేట్: ఆ రాష్ట్ర గవర్నర్ సూచన

Kerala Governor: కట్నం తీసుకోబోమని సంతకాలు చేస్తేనే డిగ్రీ సర్టిఫికేట్: ఆ రాష్ట్ర గవర్నర్ సూచన

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కట్న దురాచారాన్ని రూపుమాపే చర్యలపై ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్​ ఆరిఫ్ మహమ్మద్​ ఖాన్ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సటీల వైస్​ చాన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో వరకట్న సమస్యలు రాకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఇంకా చదవండి ...
కేరళలో వరకట్న వేధింపుల కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొన్ని సంవత్సరాల్లో వరకట్న వేధింపుల వల్ల మహిళల మరణాలు పెరగడంతో ఇటీవల ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఈ కట్న దురాచారాన్ని రూపుమాపే చర్యలపై ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్​ ఆరిఫ్ మహమ్మద్​ ఖాన్ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సటీల వైస్​ చాన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో వరకట్న సమస్యలు రాకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు డిగ్రీ పట్టా అందుకోకముందే వరకట్నం తీసుకోబోమంటూ వారితో బాండ్లపై సంతకాలు చేయించుకోవాలని యూనివర్సిటీల వైస్​ చాన్సిలర్లకు గవర్నర్ సూచించారు.

“వరకట్నం తీసుకోం, ఇవ్వం.. అని డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చే ముందే విద్యార్థులతో సంతకాలు చేయించుకోవాలి. ఇటీవలి కాలంలో బాధాకరమైన కారణాలతో కేరళ వార్తల్లో నిలిచింది. వరకట్న వేధింపుల వల్ల సంభవించిన మరణాలతో రాష్ట్రంలో ప్రకంపనలు రేగుతున్నాయి. అత్యధిక అక్షరాస్యత, సామాజిక అవగాహన ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘనటనలు జరగడం చాలా విచారకరం. ఈ రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో విశేషమైనది. అందుకే కట్నం డిమాండ్ చేయబోమని, ఇవ్వబోమని విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేయాలి. ఆ విధంగా వారిలో స్ఫూర్తి కలిగించేందుకు ముందడుగు వేయాలి. అందుకే కట్నానికి వ్యతిరేకంగా విద్యార్థులతో వైస్ చాన్సిలర్లు బాండ్లపై సంతకాలు చేయించాలి. అలా చేసిన వారికే సర్టిఫికేట్లు అందించాలి” అని గవర్నర్​ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చెప్పారు. విద్య అనేది జ్ఞానాన్ని ప్రజ్వలితం చేసేలా ఉండాలి, కానీ ప్రస్తుతం డబ్బు సంపాదన కోసమే విద్య అనేలా పరిస్థితులు తయారయ్యాయని గవర్నర్​ ఆవేదన వ్యక్తం చేశారు.


వరకట్నం తీసుకోవడం తీవ్ర నేరం అని గవర్నర్​ అన్నారు. కేవలం ఈ కట్న వ్యతిరేక బాండ్లపై సంతకాల విషయం విద్యార్థులకు పరిమితం చేయకుండా.. అందరికీ వర్తించేలా చేయాలన్నారు. “యూనివర్సిటీలు, కళాశాలల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే వారు కూడా కట్నం తీసుకోబోమని డిక్లరేషన్​పై సంతకాలు చేసేలా చర్యలు తీసుకోవాలి. అలాగే పిల్లలను వివిధ కోర్సుల్లో చేర్చే ముందు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాండ్లపై సంతకాలు చేయాలి. ఇందుకోసం పూర్తి ప్రొఫార్మా, వివరాలను అతి త్వరలో నిర్ణయిస్తాం” అని గవర్నర్​ అలీ మహమ్మద్ ఖాన్ చెప్పారు. విద్యార్హతల వల్ల మ్యారేజీ మార్కెట్​లో కట్నం విలువ పేరిగే సంస్కృతికి చరమగీతం పాడాలని గవర్నర్ అన్నారు. అలాగే వరకట్నం దురాచారం పూర్తిగా అంతమయ్యేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Kerala, Trending

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు