Home /News /trending /

MAKAR SANKRANTI SPECIAL 6 FESTIVE RECIPES FROM 6 STATES SU GH

Makara Sankranti Specials: సంక్రాంతి పండగ రోజు ఆ 6 రాష్ట్రాల్లో చేసే సంప్రదాయ వంటకాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గాలిపటాలు, రుచికరమైన చిరుతిళ్లు, సంప్రదాయ క్రీడలు.. ఇలా సంక్రాంతి తెచ్చే సంబరాలు చాలానే ఉన్నాయి.

రైతుల పండుగ అయిన సంక్రాంతి పండుగను మనదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. కొత్తగా పండిన పంటలతో చేసే వివిధ రుచులు సంక్రాంతి స్పెషల్స్ గా నోరూరిస్తాయి. మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తూ జరుపుకునే సంక్రాంతికి, తమ ప్రాంతంలో పండే పంటలనుబట్టి వంటలు వండుతారు. జనవరి 14వ తేదీ గురువారం నాడు మకర సంక్రాంతి పండుగరోజున పుణ్యకాలం సమయం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.45 వరకు ఉంటుంది. సుమారు 9 గంటల 15 నిమిషాలపాటు పుణ్యకాలం ఉంటుంది.

మకర సంక్రాంతి నాడు మహా పుణ్యకాలం ఘడియలు ఉదయం 8.30 నుంచి ఉదయం 10.15 . మకర సంక్రమణాన్ని పుణ్యకాలంగా భావిస్తారు కనుక ఉత్తరాయణం ప్రారంభమయ్యే తొలి రోజును అత్యంత ఘనంగా జరుపుకుంటాం. కొత్త పంటలన్నీ ఇంటికి చేరిన ఈ కాలాన్ని లోహ్రి, మకర్ సంక్రాంతి, పొంగల్, బిహు, పొంగల్, సంకురాత్రి, సంక్రాంతి వంటి పేర్లతో పిలుస్తారు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే ఈరోజున నదుల్లో, సంగమ స్థావరాల్లో, సముద్రాల్లో పవిత్ర స్నానాలు ఆచరించి, పెద్దలకు పిండప్రదానాలు చేస్తారు. శీతాకాలం ముగిస్తుంది కనుక కమ్మని రుచికరమైన విందులతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. దక్షిణాది రాష్ట్రాల్లో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో సంక్రాంతి లక్ష్మికి ఘనంగా ఆహ్వానం పలుకుతారు.

మనదేశంలోని 6 రాష్ట్రాల్లో 6 సంక్రాంతి స్పెషల్ డిషెస్ ను మీకు పరిచయం చేస్తున్నాం..

పతిషప్తా- బెంగాల్
బెంగాలీ సంప్రదాయ వంటకమైన పతిషప్తాను (Patishapta) సంక్రాంతికి వండి, వడ్డిస్తారు. స్టఫ్డ్ డెజర్ట్ గా పేరుగాంచిన ఈ పతిషప్తా చాలా రుచికరంగా ఉంటుంది. పతిషప్తా రెండు రకాల్లో నోరూరిస్తుంది. క్రిస్పీ క్రేప్ గా తయారు చేసేందుకు ఆల్ పర్పస్ ఫ్లోర్, స్వీట్, బెల్లం, కొబ్బెర లేదా ఖోయాతో నింపి చేస్తారు. దీన్ని మళ్లీ కండెన్స్డ్ మిల్క్ లో ముంచుతారు. వీటిని మీరు ఈ సంక్రాంతికి సెలవుల్లో ట్రై చేయచ్చు..Click here for the recipe.

దహి చురా గుర్-బిహార్(dahi chura gur)
బిహార్ లో ఇది అత్యంత పాపులర్ బ్రేక్ ఫాస్ట్ డిష్. పెరుగు, అటుకులు లేదా వేయించిన అటుకులు, బెల్లం వేసి సింపుల్ గా తయారు చేసే వంటకాన్ని బిహార్ లో తప్పకుండా సంక్రాంతి రోజు తింటారు. మకర సంక్రాంతి రోజు తప్పకుండా బెల్లం, నువ్వులు తినటం అన్నది బిహార్ లో ఆచారం కూడా. శీతాకాలం నుంచి వేసవిలోకి అడుగుపెట్టే సమయంలో నువ్వులు, బెల్లం తినటంతో మన శరీరం కొత్త వాతావరణానికి ఈజీగా అలవాటు పడుతుందని ఇందులోని అంతార్థం కనుక సంక్రాంతికి చేసే వంటకాలు స్వీట్ అయినా హాట్ అయినా వాటన్నింటిలో బెల్లం, నువ్వులు విస్తృతంగా ఉపయోగిస్తారు. .

తిల్ కీ చిక్కీ-హర్యానా
సంక్రాంతి పండుగ అంటేనే నువ్వులు వివిధ రూపాల్లో తినే పండుగ కాబట్టి హర్యానాలో నువ్వులతో చిక్కీ (Til ki Chikki) చేసి అందరూ పంచుకుని తింటారు. బెల్లం, నువ్వుల్లో ఉన్న ఆరోగ్యకరమైన సుగుణాలన్నీ ఒంట్లోకి పోయేందుకు ఇది సహకరిస్తుంది. బెల్లం పాకంతో నువ్వులు లేదా నువ్వుల పొడి వేసి చేసే లడ్డూలు, చిక్కీలు రుచి కూడా చాలా బాగుంటుంది. మంచి పోషకాలు నిండిన ఈ చిక్కీలను చిన్నా పెద్దా అంతా ఇష్టంగా తింటారు. హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో సంక్రాంతికి విధిగా చిక్కీలు చేసి, తింటారు.

పూరన్ పోలీ-మహారాష్ట్ర
మనం భక్ష్యాలు లేదా ఓళిగళు లేదా బొబ్బట్లు లేదా పోళెలు అని పిలుచుకునే స్వీట్ పరాఠాను మహారాష్ట్రలో పూరన్ పోలీ (Puran Poli) అంటారు. బెల్లంతో శెనగపప్పు వేసిన పుర్ణాన్ని రుబ్బుకుని మైదాలోపల స్టఫ్ చేసి చపాతీలా వత్తి చేసే పూరన్ పోలీలను మహారాష్ట్రలో సంక్రాంతికి వండుకుంటారు. దీనిపై నెయ్యి వేసుకుని తింటి మరింత రుచికరంగా ఉంటుంది.

కిచ్డీ-హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు కిచ్డీ (Khichdi) వండుకుని దానిపై నెయ్యి దట్టించి వేసుకుని ఆరగిస్తారు. కందిపప్పు, బియ్యం వేసి వండే ఈ కిచ్డీలోకి హిమాచలీలు కొందరు కూరగాయలు కూడా వేసుకుని .. వాటిలోకి అప్పడాలు చెట్నీ వేసుకని కడుపారా తింటారు.

ఉంధియూ-గుజరాత్
శీతాకాలంలో గుజరాతీలు ఎక్కువగా చేసుకుని ఇష్టంగా లాగించే వంటకం ఉంధియూ. కందగడ్డ, ఆలూ, పచ్చి అరటికాయ, బీన్స్, కసూరీ మేతి వంటివన్నీ వేసి చేసే సింగిల్ డిష్ ను ఉంధియూ అంటారు. సరిగ్గా చెప్పాలంటే ఇది మన కలగూరనే. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తినేంత రుచి ఉన్న ఉంధియూని మట్టిపాత్రలో తలకిందలుగా చేసి వండుతారు. గుజరాతీలో ఉంధు అంటే తలకిందలు అని అర్థం.

ఈ సంక్రాంతికి వెరైటీగా వేరే రాష్ట్రంలో చేసుకునే ఇలాంటి సంప్రదాయ వంటలు చేసుకుంటే బాగుంటుంది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Kite festival, Recipes, Sankranti, Sankranti 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు