హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Mahindra Mega Offer: ప్రభుత్వ ఉద్యోగులకు మహీంద్రా స్పెషల్ ఆఫర్లు.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్

Mahindra Mega Offer: ప్రభుత్వ ఉద్యోగులకు మహీంద్రా స్పెషల్ ఆఫర్లు.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్

మహీంద్రా థార్

మహీంద్రా థార్

పండుగ సీజన్లో తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.

పండుగ సీజన్లో తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పిఎస్యు ఉద్యోగుల కోసం ప్రత్యేక నగదు తగ్గింపుతో పాటు స్పెషల్ ఫైనాన్స్ ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా, మహీంద్రా వాహనాల కొనుగోలుపై ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా రూ. 11,500 వరకు అదనపు నగదు తగ్గింపుతో పాటు మహీంద్రా వాహనాల కొనుగోలుపై జీరో ప్రాసెసింగ్ ఫీజును అమలు చేస్తుంది. ఈ ఆఫర్లన్నీ ఇది వరకే పండుగ సీజన్లో భాగంగా మహీంద్రా ప్రకటించిన ఆఫర్లకు అదనం అని చెప్పవచ్చు. 'సర్కార్ 2.0' కార్యక్రమం కింద కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు నగదు తగ్గింపులు, సులభమైన ఈఎంఐ ఆప్షన్లు, తక్కువ వడ్డీరేట్లకే వెహికిల్ లోన్ వంటి ఆకర్షనీయమైన ఆఫర్లను అందిస్తుంది. అంతేకాక, అతి తక్కువ అనగా 7.25 శాతం వడ్డీ రేటుతో వెహికిల్ లోన్ ఇస్తామని కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు ఈ పండుగ సీజన్ సేల్స్ను పెంచుకోవడానికి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా పర్సనల్ యుటిలిటీ వెహికిల్స్పై ఎనిమిదేళ్ల వరకు నెలవారీ ఈఎంఐ అవకాశాన్ని కల్పిస్తుంది. తద్వారా మీరు లక్షకు రూ.799 కనీస ఈఎంఐ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఆఫర్ల కోసం సమీప డీలర్షిప్ను సంప్రదించండి..

కాగా, ఈ స్కీంలలో కొన్నింటిని వివిధ ఫైనాన్స్ సంస్థల ద్వారా అందిస్తున్నామని, అందువల్ల, వీటిలో చేరడానికి వినియోగదారులు సమీప డీలర్షిప్లను సంప్రదించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. తక్షణ EMI సౌకర్యాలను అందించడానికి మహీంద్రా సంస్థ అనేక ఫైనాన్స్ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ఫైనాన్స్ సంస్థల సహకారంతో వినియోగదారులకు కాంటాక్ట్లెస్ పేమెంట్ సేవలను కూడా అందిస్తుంది. ఈ ఆఫర్లన్నీ మహీంద్రాకు చెందిన అన్ని ఉత్పత్తులపై వర్తిస్తాయని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. కాగా, గత నెలలో లాంచ్ అయిన మహీంద్రా థార్ కేవలం ఒక్క నెలలోనే 20 వేల బుకింగ్స్ను అందుకొని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ దీపావళి సీజన్ ప్రారంభానికి గుర్తుగా 500 థార్ ఎస్‌యూవీ కార్లను నవంబర్ 7 నుంచి నవంబర్ 9 మధ్య కొనుగోలుదారులకు డెలివరీ చేయనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. దీనిపై మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా మాట్లాడుతూ "వినియోగదారుల నుంచి మహీంద్రా థార్కు వచ్చిన అపూర్వమైన స్పందనతో మేము ఆనందంలో మునిగిపోయాము. ఈ అపూర్వ స్పందన మా అంచనాలను, ఉత్పత్తి సామర్థ్యాలను అధిగమించింది." అని ఆయన అన్నారు.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Automobiles

ఉత్తమ కథలు