• HOME
 • »
 • NEWS
 • »
 • TRENDING
 • »
 • MAHARASTRA LEOPARD GIVES BIRTH TO 4 CUBS IN FARMERS HUT AT NASHIK IGATPURI AREA

రైతు పూరి గుడిసెలో...నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత

రైతు పూరి గుడిసెలో...నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత

నాసిక్ జిల్లాలోని అటవీప్రాంతంలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత

మహారాష్ట్రలోని ఓ మారుమూల ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న ఓ రైతు పూరి గుడిసెలో చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.

 • Share this:
  మహారాష్ట్రలోని ఓ మారుమూల ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న ఓ రైతు పూరి గుడిసెలో చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. నాసిక్‌కు సమీపంలోని ఇగట్పురి ప్రాంతంలో స్థానిక గిరిజనుల ద్వారా అటవీశాఖ అధికారులకు ఈ సమాచారం తెలిసింది. చిరుత, దాని పిల్లలన్నీ ఆరోగ్యకరంగా..క్షేమంగా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుతతో పాటు దాని పిల్లలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చిరుత సంచారంపై స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే చిరుత పిల్లల సంరక్షణ నిమిత్తం...కొన్ని రోజులు అక్కడే ఉంచి, ఆ తర్వాత అటవీ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.  చిరుత జనావాసాల్లోకి వచ్చి పూరి గుడిసెలో పిల్లలు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అవి తమకు హాని తలపెట్టవచ్చని స్థానిక గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాత్రి పూట తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే సాహసించలేకపోతున్నారు.
  Published by:Janardhan V
  First published: