HOME »NEWS »TRENDING »maharastra former chief minister devendra fadnavis wife amruta fadnavis trolled for new marathi song netizens called it nepotism ms

Amruta Fadnavis: పాట పాడిన మాజీ సీఎం భార్య.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Amruta Fadnavis: పాట పాడిన మాజీ సీఎం భార్య.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
అమృతా ఫడ్నవీస్ (Image Credits Twitter)

Netizens Trolled Amruta Fadnavis: పలువురు నెటిజన్లు ఆమెను యూఎస్ కు వెళ్లాలని.. అక్కడ క్యాపిటల్ హిల్ ముందు పాట పాడాలని సూచిస్తున్నారు. అలా పాట పాడితే అక్కడ నిరసన చేస్తున్న వారంతా పారిపోతారని రాసుకొచ్చారు.

  • News18
  • Last Updated: January 08, 2021, 22:10 IST
  • Share this:
    మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ తెలుసు కదా. బ్యాంకర్ (ఆమె యాక్సిస్ బ్యాంక్ లో ఉద్యోగి) గానే కాకుండా ఆమెలో గాయకురాలు కూడా దాగున్నారు. తాజాగా ఆమె పాడిన పాట నెట్టింట వైరలవుతున్నది. ఆమె అందంగానే పాడినా.. నెటిజన్లు మాత్రం అమృతను మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పలువురు నెటిజన్లు ఆమెను యూఎస్ కు వెళ్లాలని.. అక్కడ క్యాపిటల్ హిల్ ముందు పాట పాడాలని సూచిస్తున్నారు. అలా పాట పాడితే అక్కడ నిరసన చేస్తున్న వారంతా పారిపోతారని రాసుకొచ్చారు. ఇక ట్విట్టరైతే ఇది నెపోటిజనం (బంధుప్రీతి) అంటూ సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నది.

    మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ తాజాగా పాడిన ఒక మరాఠీ పాట ఆమెకు మంచి పేరు కంటే ట్రోలింగ్ నే ఎక్కువ తెచ్చిపెడుతున్నది. దావ్ అంధార్ సినిమా అనే మరాఠీ సినిమా కోసం ఆమె పాట పాడారు. భయం, అనిశ్చితి ల సంగమమే ఈ పాట అని ఆమె ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ పాటకు సంబంధించిన టీజర్ ను ఆమె ట్విట్టర్ లో పంచుకోగానే.. ఆమెపై ట్రోలింగ్ స్టార్టయ్యింది.







    దావ్ అంధాన్ అనే మరాఠీ సినిమాలో గుల్షన్, సాగరికా ఘట్గే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జీత్ గంగూలీ సంగీతం సమకూర్చిన ఈ జాజ్ గీతాన్ని అమృతా ఫడ్నవీస్ ఆలపించారు. ఈ గీతానికి సంబంధించిన విషయాన్ని ఆమె ట్విట్టర్ లో స్వయంగా వెల్లడించారు.





    కాగా.. అమృత ఈ పోస్ట్ చేయంగానే నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. అందుకు సంబంధించిన పోస్టులు ఇక్కడ ఉన్నాయి.

















    నెటిజన్లలో చాలా మంది ఇది బంధు ప్రీతి కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమందేమో... ‘మీరు దయచేసి పాడకండి మేడం.. లెజెండ్ గాయకులను అవమానపరచొద్దు...’ అంటూ కామెంట్ చేశారు.
    Published by:Srinivas Munigala
    First published:January 08, 2021, 22:10 IST

    टॉप स्टोरीज