హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో... పండుగ రోజు అదృశ్యమైన 200 మంది కొత్త అల్లుళ్లు.. కారణం ఏంటంటే...

వామ్మో... పండుగ రోజు అదృశ్యమైన 200 మంది కొత్త అల్లుళ్లు.. కారణం ఏంటంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుళ్లు గ్రామస్థుల కళ్లలో పడకుండా మెల్లగా జారుకున్నారు. అయితే... మరోవైపు గ్రామంలో హోలీ వేడుకలు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.

  • Local18
  • Last Updated :
  • Maharashtra, India

మన దేశంలో అనేక ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తుంటాం. అన్ని కులస్థుల, మతస్థుల నమ్మకాలను కూడా గౌరవంగా చూస్తూంటాం. అయితే... సాధారణంగా పెళ్లి తర్వాత కొత్త అల్లుళ్లకు ఇచ్చే రెస్పెక్ట్ మాములగా ఉండదు. ఏడాది పొడవున ప్రతి పండుగకు అత్తగారింటి వారు ఆహ్వనిస్తుంటారు. కూతురు అల్లుడికి కొత్తబట్టలు, బంగారం, ఇతర వస్తువులు వారి తాహాతుకు బట్టి కానుకలుగా ఇస్తుంటారు.

తెలంగాణలో అయితే.. దసరా, దీపావళికి అదే విధంగా ఆంధ్రలో అయితే.. సంక్రాంతికి అల్లుళ్లను తమ ఇంటికి ఆహ్వానించి నచ్చిన వంటకాలను తయారు చేస్తుంటారు. ఇక పొరుగున ఉన్న మహారాష్ట్రలో కూడా ఇదే సంప్రదాయం ఉంది. అక్కడ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో పెళ్లి తర్వాత.. హోలీకి అత్తాగారింటికి వచ్చే.. కొత్త అల్లుళ్లకు బీడ్ జిల్లాకు చెందిన ప్రజలు విచిత్రమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ పద్ధతి నుంచి తప్పించుకొవడానికి అల్లుళ్ళు అనేక ప్లాన్ లు వేస్తుంటారు.

పూర్తి వివరాలు.. మహారాష్ట్రలో (Maharashtra) హోలీని కొన్ని ప్రాంతాలలో వెరైటీగా జరుపుకుంటారు. కొందరు హోలీకి ముందు రోజు కామదహానం చేసి ఆ తర్వాత కుడకల దండను పిల్లల మెడలో వేస్తుంటారు. అంతే కాకుండా కొత్త అల్లుళ్లకు హోలీరోజు రంగులు జల్లుతూ, కొత్త బట్టలు ఇచ్చి,కూతురు అల్లుడి మధ్య హోలీని వేడుకగా జరుపుకుంటారు. అయితే... బీడ్ జిల్లాకు చెందిన ప్రాంతంలో అనాదీగా ఒక వెరైటీ ఆచారం వాడుకలో ఉంది. అక్కడ పెళ్లి తర్వాత.. కొత్త అల్లుళ్లను గాడిదల మీద ఎక్కించి గ్రామంలోని హనుమాన్ ఆలయం నుంచి ఊరంతా తిప్పి ఆతర్వాత, అత్తగారింటికి తీసుకెళ్తారు. అయితే.. గ్రామంలో కొత్తగా ఎవరికి పెళ్లయ్యిందని తెలుసుకొవడానికి రెండు రోజుల ముందు నుంచి ప్రత్యేకంగా ధూల్వాడి కవాతును కూడా ఏర్పాటు చేస్తారు.

వీరు గ్రామంలో కొత్త అల్లుళ్లను ఒక కంటకనిపెడుతుంటారు. అయితే..ఈ ఏడాది కూడా బీడ్ లో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో... కొంత మంది అల్లుళ్లు ఈ విధంగా గాడిద మీద ఎక్కి ఊరేగిపును తప్పించుకొవడానికి సీక్రెట్ ప్రదేశాల్లో వెళ్లిదాక్కున్నారు. దాదాపు.. బీడ్ లో 200 మంది అల్లుళ్లు అదృశ్యమైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కొత్త అల్లుళ్లను గాడిదల మీద ఊరేగించి, ఆతర్వాత.. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద మామతో బట్టలు, కానుకలు ఇచ్చేలా చూస్తారు. ఇది అనాదీగా తమ ఆచారం మంటూ గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది.

First published:

Tags: Holi 2023, Maharashtra, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు