హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్..

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్..

ఉద్ధవ్ ఠాక్రే (ఫైల్)

ఉద్ధవ్ ఠాక్రే (ఫైల్)

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో అనుకొని పరిణామాలు సంభవిస్తున్నాయి. తాజాగా,  సీఎం ఉధ్దవ్ ఠాక్రేకు (Uddhav Thackeray) కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారీ కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్పటికే మహారాష్ట్రలో రాజకీయాలల్లో (Political crisis) నిముష నిముషానికి పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. మధ్యాహ్నం ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో .. వర్చువల్ విధానంలో సమావేశం అవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, కేంద్రం మహారాష్ట్ర బాధ్యతలను గోవా గవర్నర్ శ్రీధరణ్ పిళ్లై కి అప్పగించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra Political Crisis) అంతకంతకూ ముదురుతుంది.


ముఖ్యమంత్రి రాజీనమా, అసెంబ్లీ రద్దు దిశగా వెళుతోంది. అధికార మహా వికాస్ అగాధి కూటమి సర్కారుకు షాకిస్తూ శివసేన మంత్రి ఏక్ నాథ్ షిండే ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని అస్సాంలో క్యాంపె పెట్టారు. తన బలాన్ని ప్రదర్శిస్తూ ఆయన బుధవారం ఫొటోలు విడుదల చేశారు. తీవ్ర పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ రద్దుకు సైతం వెనుకాడబోమని సేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన హింట్ ఇచ్చారు.

షిండే వర్గం ఎమ్మెల్యేలు గుజరాత్ నుంచి తమ క్యాంపును అస్సాంకు మార్చారు. పోలీస్ భద్రత నడుమ వారు సూరత్ నుంచి గువహటి వెళ్లారు. షిండే వర్గం ఎమ్మెల్యేలు 40 మంది ప్రస్తుతం అసోం రాష్ట్ర రాజధాని గౌహతిలోని రాడిసన్ బ్లూ టల్‌లో బస చేశారు. ఫొటోను విడుదల చేయడం ద్వారా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తమ బలాన్ని చూపించారు.

మహా సంక్షోభంలో బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోన్న శివసేన అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాకు ముందే అసెంబ్లీని రద్దుకు మొగ్గుచూపుతున్నారని సమాచారం. రాజీపడడం కంటే అసెంబ్లీ రద్దుకు సిద్ధమయ్యి, అధికారాన్ని త్యజించడమే ఉత్తమమని ఠాక్రే భావిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ‘ సంక్షోభం మహారాష్ట్ర అసెంబ్లీ రద్దుకు దారితీస్తోంది’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మహారాష్ట్ర అసెం బ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 106 మంది, శివసేనకు 55, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులు 29 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎంవీఏ సర్కారుకు 152 మంది సభ్యుల బలం ఉంది. అయితే, శివసేన సీనియర్‌ నేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిండే కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి సూరత్‌కు వెళ్లిపోయారు. షిండేతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి.

First published:

Tags: Covid positive, Maharashtra, Uddhav Thackeray

ఉత్తమ కథలు