MAHARASHTRA PETROL SOLD FOR RUPEES 1 A LITER IN THIS CITY TO PROTEST RAISING PRICES PAH
Shocking: బంపర్ ఆఫర్.. లీటర్ పెట్రోల్ ధర కేవలం ఒక్క రూపాయే.. ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
Petrol Price: ప్రస్తుతం పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటేసిన పెట్రోల్ రేటు.. డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతుంది. ప్రస్తుతం ఒక చోట మాత్రం లీటర్ పెట్రోల్ ధరను కేవలం ఒక్కరూపాయికే విక్రయిస్తున్నారు.
Maharashtra petrol sold for rupees 1 a liter: ప్రపంచంలో చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకి పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తమ వాహానాన్ని బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఇక.. ప్రజలు దీనిపై వినూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ దాటేసి.. డబుల్ సెంచరీ వైపుకు దూసుకు పోతుంది.
కొన్ని చోట్ల ప్రజలు.. తమ వాహానాలను తోపుడు బండ్ల మీద వేసి వెరైటీగా నిరసన తెలుపుతున్నారు. మరికొన్ని చోట్ల క్రికెట్ లో సెంచరీ కొట్టినట్లుగా.. పెట్రోల్ బంక్ ముందు బ్యాట్ తో ఫోజులిస్తున్నారు. ఇక కొన్ని చోట్ల కొత్త పెళ్లి వేడుకలలో కొత్త జంటలకు పెట్రోల్, డీజీల్ బాటిళ్లను బహాుమతులుగా ఇస్తున్నారు. వారంతా వినూత్న రీతితో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసన తెలియజేస్తున్నారు. ఇక రాజకీయ నాయకులు, పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలకు సైకిల్ మీద వచ్చి నిరసన తెలియజేస్తున్నారు.
మరికొన్ని చోట్ల వాహానం కంటె.. గుర్రాన్ని మేపుకొవడం బేటర్ అంటూ.. గుర్రాన్ని కోనుగోలు చేశారు. ఇలా ప్రజలు తమ నిరసనలు తెలియజేస్తునే ఉన్నారు. ప్రజలు ఎంత నిరసన తెలిపిన.. ప్రభుత్వాలకు మాత్రం చీమ కుట్టినట్లుగా లేదు. ప్రతి రోజు పెట్రోల్ ధరలు పెరుగుతునే ఉన్నాయి. తాజాగా, పెట్రోల్ ను ఒక రూపాయికే విక్రయించి వెరైటీగా నిరసన తెలిపారు సోలాపూర్ చెదిందిన ఒక వ్యాపారి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరలు.. మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన వ్యాపారి .. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వానికి వినూత్నంగా నిరసన తెలిపారు. లీటర్ పెట్రోల్ ను కేవలం ఒక్కరూపాయికే విక్రయించారు. సోలాపూర్ కు చెందిన మహేష్ సర్వగోడా అనే వ్యాపారి.. ఒక్క రూపాయికే లీటల్ పెట్రోల్ ను విక్రయించారు. మొదటగా వచ్చిన ఒక 500 మందికే ఈ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆ నోటా.. ఈ నోటా.. రూపాయికే లీటర్ పేట్రోల్ విక్రయం.. నగరమంతా పాకిపోయింది. దీంతో నగరం మీద బంక్ దగ్గరకు ప్రజలు పోటేత్తారు. దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు ఒకర్నిమరొకరు తోచుకొవడం ప్రారంభించారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి రద్దీని అదుపు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.