హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

డాక్టర్ క్యాబిన్ లో రోగికి హార్ట్ ఎటాక్.. డాక్టర్ ఏంచేశాడంటే.. వీడియో వైరల్..

డాక్టర్ క్యాబిన్ లో రోగికి హార్ట్ ఎటాక్.. డాక్టర్ ఏంచేశాడంటే.. వీడియో వైరల్..

రోగికి సీపీఆర్ చేస్తున్న డాక్టర్

రోగికి సీపీఆర్ చేస్తున్న డాక్టర్

Maharashtra: డాక్టర్ క్యాబిన్ లో రోగి, అతని బంధువులు మాట్లాడుతున్నారు. ఇంతలో డాక్టర్ అక్కడ ఫైల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెషెంట్ కు చూస్తుండానే కూర్చిలోకి పడిపోయాడు. నోట్లో నుంచి మాటలు ఆగిపోయాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

మనలో చాలా మంది అనుకొకుండా గుండెపోటుకు గురౌతుంటారు. కొంత మంది ఎక్కువగా పనిచేస్తుంటారు. ఈ క్రమంలో కూడా ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి సందర్భాలలో గుండె పోటుకు (Heart attack) గురౌతుంటారు. కొందరు మాట్లాడుతుండగానే, హఠాత్తుగా కిందపడిపోతారు. ఈ మధ్య కాలంలో యువకుల్లో కూడా గుండె పోటు సంభవిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ సమయంలో ఎవరైన వెంటనే స్పందించి, సీపీఆర్ చేస్తే బాధితుడు తిరిగి బతికే అవకాశాలు ఉన్నాయి. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు... మహారాష్ట్రలోని (Maharashtra)  కొల్హాపూర్ లో ఊహించని ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ అర్జున్ అడ్నాయక్ దగ్గరకు గుండె సంబంధిత రిపోర్టులను చూయించడానికి పెషెంట్ లు వచ్చారు. ఈ క్రమంలో ఆయన రిపోర్టులను చూస్తున్నారు. ఇంతలోనే షాకింగ్ ఘటన జరిగింది. డాక్టర్ ముందే పెషెంట్ కు స్ట్రోక్ వచ్చింది. దీంతో అతని నోటి నుంచి మాటలు రాలేదు. శరీరమంతా చల్లబడిపోయింది. వెంటనే డాక్టర్ లేచి.. బాధితుడిని సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రెససిటేషన్) చేశారు. ఈ క్రమంలో.. వెంటనే బాధితుడి గుండెకు పలుమార్లు కొడుతూ, ఆయనకు వైద్యం అందించారు.


కొంత సేపటికి బాధితుడి తిరిగి మాములు స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతనికి మెరుగైన వైద్యం అందించారు. కళ్ల ముందే .. బాధతో విలవిల్లాడిపోతున్న బాధితుడిని, వెంటనే స్పందించి ట్రీట్ మెంట్ చేసిన ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (viral video) మారింది. దీన్ని రాజ్యసభ ఎంపీ ధనంజయ్ మహదిక్ సహా.. పలువురు యూజర్లు హ్యాట్సాఫ్ అంటూ.. కామెంట్ లు పెడుతూ.. తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా ఒక మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది.

ట్రాఫిల్ రూల్స్ పాటించాలని అధికారులు మోత్తుకున్న, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఇప్పటికి చాలా మంది తమ బుద్ధిని మాత్రం మార్చుకొవడంలేదు. ఇప్పటికీ రాంగ్ రూట్ లో వెళ్లడం, త్రిబుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకొకపోవడం, కారులో సీటు బెల్ట్ ను అవాయిడ్ చేస్తుంటారు. మరికొందరు తాగి వెహికిల్ లను నడిపిస్తుంటారు. రాంగ్ రూట్ లో పార్కింగ్ చేస్తుంటారు. ఇలాంటి సందర్బాలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక మహిళ రోడ్డు పైన దారిలో తాను నడుచుకుంటూ వెళ్తుంది.

అప్పుడు ఆమెకు ఎదురుగా కొంత దూరంలో ఆటో నిలిపి ఉంది.అయితే.. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. ఒక కారు వేగంగా వచ్చింది. అది వచ్చి.. ఆటోను బలంగా ఢీకొట్టింది. అప్పుడు ఎగిరి ఒక వైపు బోల్తా పడింది. కారు మరో వైపుకు వెళ్లిపడింది. ఇవి రెండు కూడా మహిళకు వెంట్రుక వాసిలో దూరంలో నుంచి వెళ్లిపోయాయి.  దీంతో ఆమె భయంభయంగా అలానే చూస్తూ ఉండిపోయింది. అక్కడున్న వారంతా.. మహిళకు ఏమైపోయిందో అని భయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోను ఐపీఎస్ సజ్జనార్ (VC Sajjanar)  తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Doctors, Heart Attack, Maharashtra, Viral Video

ఉత్తమ కథలు