హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పోలీసులతో ఫైర్ బ్రాండ్ ఎంపీ వాగ్వాదం.. కారణం ఏంటంటే..

పోలీసులతో ఫైర్ బ్రాండ్ ఎంపీ వాగ్వాదం.. కారణం ఏంటంటే..

ఎంపీ నవనీత్ కౌర్ (ఫైల్)

ఎంపీ నవనీత్ కౌర్ (ఫైల్)

Maharashtra: అమరావతి ఎంపీ నవనీత్ రాణా పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తన భర్తపై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

ఫైర్ బ్రాండ్, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా (navneet kaur rana)  మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే ఈ దంపతులు.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రె ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పడంతో పోలీసులు నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవిరాణాలను అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో పెద్ద దుమారంగా మారి, దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత.. దంపతులు షరతులతో కూడిన బెయిల్ పైన విడుదయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా, ఈ ఎంపీ పోలీసులతో వాగ్వాదానికి దిగి మరోసారి ట్రెండింగా మారారు.

పూర్తి వివరాలు..  మహారాష్ట్రలోని (Maharashtra)  అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ తన భర్తపై వచ్చిన ఆరోపణలపై పోలీసులకు వివరణ కోరారు. కాగా, మతాంతర వివాహం చేసుకున్న తర్వాత.. ఎమ్మెల్యే రవిరాణా తనను దూరంగా ఉంచాడని, ఒక బాలిక ఫిర్యాదు చేసిందని పోలీసులు ఆరోపించారు. దీనిపై ఎంపీ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన భర్తపై ఆరోపణలు చేసిన బాలికను హాజరు పర్చాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Maharashtra, VIRAL NEWS

ఉత్తమ కథలు