Fuel price hike: దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పెట్రో ధరలు సెంచరినీ దాటేశాయి. ఇప్పటికే సామాన్యుడి పరిస్థితి దయానీయంగా మారిపోయింది. దీనిపై చాలా మంది వినూత్నంగా నిరసనలు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో పెట్రో మంటలు (Petrol Prices hike) చెలరేగుతున్నాయి. రోజురోజుకి పెట్రో ధరలు పెరిగిపోతున్నాయి. దీనితో సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బండి బయటకు తీయాలంటే.. వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక దీనిపై చాలా మంది అనేక విధాలుగా తమ నిరసనలు తెలిపారు. కొందరు పెట్రోల్ బంకు ముందు బ్యాట్, హెల్మెట్ ధరించి నిలబడి సెంచరీ చేసినట్లు ఫోజులిచ్చారు.
మరికొందరు కూడా తమ బండ్లను తోపుడు బళ్లపై పెట్టి తీసుకెళ్లారు. ఇక కొందరైతే.. సైకిళ్లు, ఎడ్ల బండుల మీద ప్రయాణించి తమ నిరసనలు తెలిపారు. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు (Viral Video) వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే, గతేడాది లాక్ డౌన్ సమయంలో మహరాష్ట్ర కు చెందిన ఒక వ్యక్తి షేక్ యూసుఫ్.. రవాణా సదుపాయాలు లేవని గుర్రం కొనుగోలు చేశాడు. అతను , ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచాడు.
#WATCH Maharashtra | Aurangabad's Shaikh Yusuf commutes to work on his horse 'Jigar'. " I bought it during lockdown. My bike wasn't functioning, petrol prices had gone up & public transport wasn't plying. which is when I bought this horse for Rs 40,000 to commute," he said (14.3) pic.twitter.com/ae3xvK57qf
— ANI (@ANI) March 14, 2022
పూర్తి వివరాలు.. మహరాష్ట్రకు (Maharashtra) చెందిన షేక్ యూసుఫ్, స్థానిక కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఇతను గతేడాది కాలంలో లాక్ డౌన్ అప్పుడు రవాణాసౌకర్యాలు లేవని 40000 లు పెట్టి ఒక గుర్రాన్ని కొనుగోలు చేశాడు. దానికి జిగర్ అనే పేరు పెట్టాడు. అప్పుడు దానిపైనే కాలేజీకి వెళ్లేవాడు. ఇక ఇప్పుడు మరొసారి వార్తలలో నిలిచాడు.
ప్రస్తుతం పెరిగిపోతున్న పెట్రో ధరలు చూస్తుంటే.. గుర్రాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా తక్కువని అన్నాడు. దీనికి అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. ప్రస్తుతం పెట్రో ధరలు మరింత పెరుగుతుండటంతో.. తన ద్విచక్రవాహనం వాడకం తగ్గించేశానని తెలిపాడు.
బైక్ కు అయ్యే.. పెట్రో ధరల కంటె నా గుర్రానికి అయ్యే ఖర్చు చాలా తక్కువని తెలిపాడు. ప్రస్తుతం గుర్రాన్ని(Horse Riding) ఎక్కువగా ఉపయోగిస్తున్నానని తెలిపాడు. ఇక రాబోయే రోజుల్లో పెట్రోల్ డబుల్ సెంచరీ కొడుతుందేమోనని షేక్ యూసుఫ్ అంటున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra, Viral Video