సాధారణంగా చిరుతపులులు చెట్లమీద తరచుగా ఎక్కుతుండటం మనం చూస్తునే ఉంటాం. అవి ఎత్తైన చెట్టమీద ఎక్కి చుట్టుపక్కల వాటి వేట కోసం చూస్తుంటాయి. తమ చెట్టుకిందకు శాఖాహార జంతువులు రాగానే వాటిపై దాడులు చేస్తుంటాయి. అదే విధంగా.. అవి వేటాడిన తర్వాత.. ఆహారాన్ని ఎత్తైన ప్రదేశంలోకి వెళ్లి తినడానికి ఆసక్తిచూపుతుంటాయి. అడవుల్లో కొన్నిసార్లు.. నక్కలు, తోడేళ్లు, అడవి కుక్కలు.. క్రూర జంతువులు వేటాడిన జంతువులను ఎత్తుకెళ్లడానికి గోతికాడ సిద్ధంగా ఉంటాయి. దీంతో అవి ఎక్కువ సార్లు.. ఎత్తైన ప్రదేశంలో ఉండి తినడానికి ఇష్టపడతాయి. అయితే.. ఒక చిరుత ఏకంగా తాటి చెట్టు మీదకు ఎక్కింది. అక్కడే కాసేపు ఉండి చుట్టుపక్కల ప్రాంతాన్ని గమనిస్తుంది. ఈ వీడియో వైరల్ గా (Viral video) మారింది.
పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని (Maharashtra) నాసిక్ లో షాకింగ్ ఘటన సంభవించింది. సిన్నార్ తాలుకాలోని సాంగ్విలో ఉన్న పొలంలో ఒక చిరుత ఏకంగా కొబ్బరి చెట్టుమీదకు ఎక్కింది. దీన్ని అక్కడే ఉన్న కొందరు పొలంపనులు చేసేవారు గమనించారు. వెంటనే అది కొమ్ము చివర వరకు వెళ్లి.. అటూ ఇటూ చూసింది. కాసేపు అక్కడే చెట్టును తన పంజాతో పట్టుకుని అక్కడే ఉంది. ఆ తర్వాత.. మెల్లగా కిందకు దిగింది. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన సంభవించింది.
If you wondered why the leopard climbed a coconut tree, see till the end???? pic.twitter.com/ArEe8XR5o6
— Susanta Nanda IFS (@susantananda3) September 18, 2022
మరో చిరుత, చెట్టుపై ఉన్న చిరుతపై దాడిచేసింది. వెంటనే భయంతో చెట్టుపై ఉన్న చిరుత ఇంకా పైకి ఎక్కింది. రెండు కూడా చెట్టుపై పొట్లాడుకున్నాయి. అప్పుడు ఒక చిరుత కిందకు దిగి అక్కడి నుంచి పారిపోయింది. అక్కడుండి వీడియో తీస్తున్న వారుకూడా ఒక్కసారిగా ఆశ్ఛర్యపోయారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుషాంత్ నందా (susanta nanda) తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడిది వైరల్ గా (Viral video) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra, Tiger, Viral Video