• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • MAHARASHTRA GROOM 81 BRIDE 72 RENEW VOW TAKEN IN 1955 GREAT GRANDKIDS AMONG BARAATIS NS GH

80 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి.. హాజరైన ముని మనవలు.. ఈ చిత్రం ఎక్కడంటే..

80 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి.. హాజరైన ముని మనవలు.. ఈ చిత్రం ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

జీవితంలో దాదాపు అందరూ ఒక్కసారి తప్పనిసరిగా పెళ్లి చెసుకుంటారు. అయితే రెండు సార్లు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది. అందులోనూ 70 ఏళ్లు పైబడిన తర్వాత. ఇదేమి విడ్డూరం అనుకుంటున్నారా? మహరాష్ట్ర యవాత్మాల్ జిల్లాలోని ఖండాలా గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఈ అరుదైన రీతిలో విహహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

  • Share this:
జీవితంలో దాదాపు అందరూ ఒక్కసారి తప్పనిసరిగా పెళ్లి చెసుకుంటారు. అయితే రెండు సార్లు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది. అందులోనూ 70 ఏళ్లు పైబడిన తర్వాత. ఇదేమి విడ్డూరం అనుకుంటున్నారా? మహరాష్ట్ర యవాత్మాల్ జిల్లాలోని ఖండాలా గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఈ అరుదైన రీతిలో విహహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. నవంబరు 16, 17వ తేదీల్లో జరిగిన ఈ పెళ్లి.. మనుమలు, మునిమనుమల సమక్షంలో జరిగింది. 65 ఏళ్ల తర్వాత వివాహానికి సంబంధించిన అన్ని ఆచారాలను పాటిస్తూ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించడం గమనార్హం. అంతేకాదు ఈ వధువు, వరులకు 50 ఏళ్లకు పైబడిన కుమారులుండడం విశేషం.

శ్రీరామ్ హివ్రాలే(81), నిర్మలా ఇంగోల్(71) మొదటిసారి 1955 నవంబరు 16న వివాహం చేసుకున్నారు. అప్పటికి వారిద్దరు మైనర్లు కావడం గమనార్హం. శ్రీరామ్ వయస్సు 15 ఏళ్లు కాగా.. నిర్మలా వయస్సు 6 ఏళ్ల లోపే. ఇద్దరికి పెద్దలు కుదిర్చి వివాహం జరిపించారు. ఈ ఏడాదితో వారి పెళ్లి జరిగి 65 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే వివాహం గురించి వారికి పెద్దగా గుర్తు లేకపోవడంతో తామంతా కలిసి మళ్లి పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు పెద్ద కుమారుడు పండ్లిక్ తెలిపారు. రెండో సారి జరిగిన ఈ పెళ్లికి పెద్ద కుమారుడితో పాటు వారి చిన్న కొడుకు పండిట్, పెద్ద చెల్లి తులిజా, కూతురు, మనుమలు హాజరయ్యారు. వివాహాలకు గోల్డెన్, సిల్వర్ జూబ్లీ నిర్వహించడం మనదేశంలో కొత్తేమి కాదు. అయితే ఈ పెళ్లికి మాత్రం ప్రత్యేకత ఉంది.

తమకు పెళ్లి చేయాలనే ఆలోచన తమ కుమార్తదే అని వృద్ధ దంపతుల చిన్నకుమారుడు పండిట్ అన్నారు. కుటుంబ సభ్యులకు వెంటనే అంగీకరిచండంతో ఈ వేడుకను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ చదువు, విజయం కోసం ఎన్నో కష్టాలు పడ్డారని, వారికి అభినందనలు తెలిపేందుకు ఈ ప్రత్యేకమైన వివాహ తంతును నిర్వహించామని స్పష్టం చేశారు.

అంతేకాకుండా ఈ వివాహానికి కేవలం 50 మందిని మాత్రమే ఆహ్వానించారు. కోవిడ్-19 ప్రభావంతో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. ఖండాల దగ్గరలోని లోని గ్రామంలో తమ పూర్వీకులు కట్టించిన ఇంటిలో వీరి వివాహం చేశారు. వృద్ధ దంపతుల కుమారులు, మనుమలు, ముని మనుమలు ఈ పెళ్లి మహోత్సవానికి హాజరయ్యారు. వధూవరుల ఇద్దరూ తమ మనవరాళ్లు పట్టుబట్టడంతో ఈ కార్యక్రమానికి అంగీకరించాల్సి వచ్చిందని శ్రీరామ్ అన్నారు. ఈ వయస్సులో తాము మంచి ఆరోగ్యంతో ఉన్నందున నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. తమ కుటుంబ ఆనందంలోనే తమ సంతోషం ఉందని తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published: